Skip to main content

SSC-CHSL 2021: ఇంటర్‌తోనే.. కేంద్ర కొలువు... సరైన ప్రణాళికతో విజయం సాధించే అవకాశం!!

SSC CHSL Notification
SSC CHSL Notification
 • ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ల్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల
 • వివిధ పోస్టుల భర్తీకి కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
 • ఇంటర్మీడియెట్, తత్సమాన అర్హతతో కొలువు దక్కించుకోవచ్చు
 • సరైన ప్రణాళికతో విజయం సాధించే అవకాశం

ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశారా..సర్కారీ కొలువు సాధించాలనుకుంటున్నారా.. కేంద్ర ప్రభుత్వ కొలువు కోరుకుంటున్నారా.. అయితే ఇప్పుడు మీ ముంగిట చక్కటి అవకాశం నిలిచింది!! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌)–2021కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది!! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలక రిక్రూట్‌మెంట్‌ సంస్థ.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ). ఈ సంస్థ తాజా నోటిఫికేషన్‌ ద్వారా పలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌–2021 నోటిఫికేషన్‌ వివరాలు, భర్తీ చేయనున్న పోస్ట్‌లు, శాఖలు, ఎంపిక విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. 

Also read: 
Cantonment‌ Board Recruitment: కంటోన్మెంట్‌ బోర్డ్, ఢిల్లీలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. ఉద్యోగార్థులకు సుపరిచితమైన పేరే. దేశంలో అతి పెద్ద నియామక సంస్థగా గుర్తింపు పొందింది. నిర్దిష్ట క్యాలెండర్‌ విధానంతో..బ్యాచిలర్‌ డిగ్రీ, ఇంటర్మీడియెట్‌ అర్హతగా ఏటా క్రమం తప్పకుండా నియామకాలు చేపడుతోంది. ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ల కోసం ఎదురు చూస్తూ.. ఆయా ఉద్యోగ పరీక్షలకు ప్రిపరేషన్‌ సాగించే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. 

పలు శాఖల్లో.. కొలువులు

 • ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌–2021 ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో, నాలుగు స్థాయిల ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. అవి..
 • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ)/జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జేఎస్‌ఏ): పే లెవల్‌–2; వేతన శ్రేణి రూ.19,900–రూ.63,200.
 • పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్‌: పే లెవల్‌–4; వేతన శ్రేణి రూ.25,500– రూ.81,100.
 • డేటాఎంట్రీ ఆపరేటర్‌: పే లెవల్‌–4, వేతన శ్రేణి రూ.25,500–రూ.81,100; పే లెవల్‌–5, వేతన శ్రేణి రూ.29, 200–రూ. 92,300
 • డేటాఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌–ఎ; పే లెవల్‌–4, వేతన శ్రేణి రూ.25,500–రూ.81, 100

Also read: Career Guidance: వైరస్‌ల పని పట్టే.. వైరాలజిస్ట్‌!

5 వేల పోస్ట్‌లు!
ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ ద్వారా మొత్తం అయిదు వేల వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. తాజా నోటిఫికేషన్‌లో పోస్ట్‌ల సంఖ్యను పేర్కొనలేదు. కాని గత మూడేళ్ల నియామక గణాంకాలను పరిశీలిస్తే.. 2018లో 5,649 పోస్ట్‌లను, 2019లో 4,893 పోస్టులను, 2020లో 4,726 పోస్ట్‌లను సీహెచ్‌ఎస్‌ఎల్‌ ద్వారా భర్తీ చేశారు. దీంతో ఈ ఏడాది కూడా దాదాపు ఇంతే సంఖ్యలో ఖాళీల భర్తీ చేపట్టే అవకాశం ఉందంటున్నారు. టైర్‌–2 పరీక్షకు ముందు పోస్టుల సంఖ్యపై ఎస్‌ఎస్‌సీ స్పష్టత ఇవ్వనుంది.

అర్హతలు

 • అర్హత: పై పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియెట్, తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి.
 • కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆఫీస్‌లో.. డేటాఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌–ఎ పోస్ట్‌లకు మ్యాథమెటిక్స్‌ గ్రూప్‌ సబ్జెక్ట్‌గా ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. 
 • దరఖాస్తు చివరి తేదీ(మార్చి 7, 2022)లోపు అభ్యర్థులు ఆయా విద్యార్హతలు ∙పొందాలి.
 • వయో పరిమితి: జనవరి 1, 2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

Also read: Job Interview: ఐబీపీఎస్ ‘ పీవో ’ ఇంటర్వ్యూలో విజయానికి టిప్స్..

మూడు దశలుగా ఎంపిక ప్రక్రియ
ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ ఎంపిక ప్రక్రియలో మొత్తం మూడు దశలు ఉంటాయి. అవి.. టైర్‌–1, టైర్‌–2, టైర్‌–3.

టైర్‌–1 ఇలా
తొలి దశలో టైర్‌–1 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో, బహుళైచ్ఛిక ప్రశ్నలతో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు చొప్పున.. మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కును నెగెటివ్‌ మార్కుగా నిర్దేశించారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌/హిందీలో ఉంటుంది.
 

Also read : Career Guidance: సరికొత్త కెరీర్ మార్గంగా డిజిటల్ జర్నలిజం.. ప్రారంభంలో రూ.20 వేల వేత‌నం..

టైర్‌–2.. రెండో దశ.. డిస్క్రిప్టివ్‌
టైర్‌–1లో చూపిన ప్రతిభ ఆధారంగా నిర్దిష్ట కటాఫ్‌ నిబంధనల ప్రకారం–మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. అందులో నిలిచిన వారు రెండో దశ.. టైర్‌–2 పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. పెన్‌ పేపర్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఎస్సే రైటింగ్, లెటర్‌ రైటింగ్, అప్లికేషన్‌ రైటింగ్, ప్రెసిస్‌ రైటింగ్‌పై వంద మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. ఈ పరీక్షలో కనీసం 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

Also read: Youtube: యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండిలా.. డబ్బు సంపాదించండిలా!

టైర్‌–3 స్కిల్‌ టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌

 • ఎంపిక ప్రక్రియలో.. చివరగా.. టైర్‌–3 పేరుతో స్కిల్‌ టెస్ట్, టైపింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. టైర్‌–2లో పొందిన మార్కుల ఆధారంగా ఆయా పోస్ట్‌లకు తుది ఎంపిక చేసే ముందు స్కిల్‌ టెస్ట్‌ పేరుతో డేటాఎంట్రీ స్కిల్స్, టైపింగ్‌ స్కిల్స్‌లో పరీక్ష నిర్వహిస్తారు. 
 • డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్ట్‌ల అభ్యర్థులు గంట వ్యవధిలో కంప్యూటర్‌ కీ బోర్డ్‌పై 8,000 డిప్రెషన్స్‌ చూపించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ఇంగ్లిష్‌ ప్యాసేజ్‌ను ఇచ్చి కంప్యూటర్‌పై టైప్‌ చేయమని అడుగుతారు.
 • డేటాఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌ ఎ పోస్ట్‌ల అభ్యర్థులు ఒక గంట వ్యవధిలో 15,000 డిప్రెషన్స్‌ చూపించాల్సి ఉంటుంది.
 • టైపింగ్‌ టెస్ట్‌: లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లేదా హిందీ టైపింగ్‌ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్‌ టైపింగ్‌కు సంబంధించి నిమిషానికి 35 పదాలు టైప్‌ చేయాల్సి ఉంటుంది.
Published date : 14 Feb 2022 12:59PM

Photo Stories