Skip to main content

CUET PG Exam Preparation Tips: సీయూఈటీ పీజీ ప్రత్యేకత, అందించే కోర్సులు.. పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ ఇలా..

పోస్ట్‌గ్రాడ్యుయేట్‌(పీజీ) కోర్సులు అందించడంలో దేశంలోని సెంట్రల్‌ యూనివర్సిటీలకు మంచి పేరుంది. ఇందులో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు నాణ్యమైన బోధనతోపాటు అధునాతన విద్యాసౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి ఉత్తమ విద్యాసంస్థల్లో ప్రవేశానికి మార్గం.. కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌(సీయూఈటీ-పీజీ). ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం 2023 ఏడాదికి సీయూఈటీ-పీజీ ప్రకటన విడుదలైంది. ఈ నేపథ్యంలో.. సీయూఈటీ పీజీ ప్రత్యేకత, అందించే కోర్సులు, దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం తదితర వివరాలు..
cuet pg 2023 notification and exam pattern and preparation tips

గతంలో సెంట్రల్‌ యూనివర్సిటీలు పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వేర్వేరుగా ఎంట్రెన్స్‌ టెస్టులు నిర్వహించేవి. దీనివల్ల విద్యార్థులు ప్రతి వర్సిటీ నోటిఫికేషన్‌కు అనుగుణంగా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకొని.. సుదూర ప్రాంతాలకు వెళ్లి రాయాల్సి వచ్చేది. విద్యార్థుల వ్యయప్రయాసలను దృష్టిలో పెట్టుకొని 2022 నుంచి కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ)ను ప్రవేశపెట్టారు. ఫలితంగా ఒకే ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందే వీలుకలిగింది.

చ‌ద‌వండి: CUET PG 2023 Notification: సీయూఈటీ(పీజీ)-2023 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇదే..

తెలుగు రాష్ట్రాల్లో

  • హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ, ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ-హైదరాబాద్, సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ-విజయనగరం, ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీ-అనంతపురంలలో ప్రవేశాలకు సీయూఈటీ పీజీ స్కోరే ప్రామాణికం. వీటితోపాటు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ-న్యూఢిల్లీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ-వారణాసి, పాండిచ్చేరి యూనివర్సిటీ, జామియా మిల్లియా ఇస్లామియా..ఇలా పలు పేరున్న సంస్థల్లో సీయూఈటీ స్కోర్‌ ద్వారానే ప్రవేశాలు కల్పిస్తారు.
  • సీయూఈటీ పీజీ ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో సైతం అడ్మిషన్‌ పొందే అవకాశముంది.

అర్హత

డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం డిగ్రీ ఫైనల్‌లో ఉన్న విద్యార్థులు సీయూఈటీ పీజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. పలు కోర్సులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. మరికొన్ని కోర్సులకు డిగ్రీలో సంబంధిత విభాగంలో చదివి ఉండాలి.

ఆన్‌లైన్‌ పరీక్ష

సీయూఈటీ పీజీ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో(లాంగ్వేజ్, సాహిత్య పేపర్లు తప్ప) ఉంటాయి. ఇందులో పార్ట్‌-ఎ, పార్ట్‌-బి అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్‌ ఎలో-25, పార్ట్‌ బిలో-75 ప్రశ్నల వస్తాయి. పార్ట్‌-ఎలో జనరల్, పార్ట్‌-బిలో సంబంధిత సబ్జెక్టు ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. ఎంఏ/ఎమ్మెస్సీ కోర్సులకు సంబంధించి పార్ట్‌-ఎలో ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్, మ్యాథమెటికల్‌ ఆప్టిట్యూడ్, అనలిటికల్‌ స్కిల్స్‌ల్లో ప్రశ్నలు వస్తాయి. సబ్జెక్టులవారీ పార్ట్‌ బి సిలబస్‌ వివరాలు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

చ‌ద‌వండి: GAT-B & BET 2023 Notification: బయోటెక్నాలజీలో పీజీ చేస్తారా.. పూర్తి వివ‌రాలు ఇవే..

అందించే కోర్సులు

  • ఎంఏ: తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, ఉర్దూ, సంస్కృతం, బెంగాళీ, ఏన్షంట్‌ ఇండియన్‌ హిస్టరీ కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ, జాగ్రఫీ, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, హోంసైన్స్, లింగ్విస్టిక్స్, నేపాలీ, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, రష్యన్, చైనీస్, ఫిలాసఫీ, ఆర్ట్, హిస్టరీ, పాళీ, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, సోషల్‌ వర్క్, ఆంత్రోపాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, కాన్‌ప్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ పాలసీ, ఎనర్జీ ఎకనామిక్స్, హెరిటేజ్‌ మేనేజ్‌మెంట్, మాస్‌ కమ్యూనికేషన్, మ్యూజియాలజీ. 
  • ఎమ్మెస్సీ: ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, కంప్యూటర్‌ సైన్స్, జాగ్రఫీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, సైకాలజీ, హోంసైన్స్, బయో కెమిస్ట్రీ, టెక్‌జియో ఫిజిక్స్, జియాలజీ, హెల్త్‌ స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్, డైరీ టెక్నాలజీ, మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటింగ్, కంప్యూటేషనల్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్, ఫోరెన్సిక్‌ సైన్స్, ఆగ్రోఫారెస్ట్రీ, సాయిల్‌ వాటర్‌ కన్జర్వేషన్, ఫుడ్‌ టెక్నాలజీ, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీ. 
  • ఎంఎఫ్‌ఎ: పెయిటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్స్, ప్లాస్టిక్‌ ఆర్ట్స్, పోటరీ అండ్‌ సిరామిక్స్, టెక్స్‌టైల్‌ డిజైన్‌; ఎంపీఏ: వోకల్‌ మ్యూజిక్, డాన్స్‌.
  • ఎంబీఏ: ఫారిన్‌ ట్రేడ్, రిస్క్‌ అండ్‌ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, అగ్రి బిజినెస్‌.
  • మాస్టర్‌ ఆఫ్‌ వొకేషన్‌: రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, మెడికల్‌ లేబొరేటరీ అండ్‌ టెక్నాలజీ. ఎంఎడ్, ఎంఎడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్, ఎంఎల్‌ఐఎస్సీ, మాన్యుస్క్రిప్టాలజీ అండ్‌ పాలియోగ్రఫీ, ఎంపీఈడీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంకాం, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ తదితర పీజీలో ఉండే అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • సీయూఈటీ పీజీలో సాధించిన స్కోరుతో ప్రవేశం పొందాలనుకుంటున్న విశ్వవిద్యాలయానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి.

చ‌ద‌వండి: Higher Education: సెంట్రల్‌ యూనివర్సిటీస్‌.. ఉమ్మడి ఎంట్రన్స్‌!

ప్రిపరేషన్‌ ఇలా

పరీక్షకు సంబంధించి సిలబస్‌ను సంబంధిత సబ్జెక్టులను పరిశీలించాలి. సిలబస్‌కు అనుగుణంగా మూడేళ్ల డిగ్రీ స్థాయి పుస్తకాలకు ప్రాధాన్యమివ్వాలి. గతంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రశ్నపత్రాలు సీయూఈటీని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. ప్రిపరేషన్‌లో భాగంగా వీలైనన్ని ఎక్కువ మాక్‌ టెస్టులను రాయాలి. దీనిద్వారా ప్రిపరేషన్‌ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. అలాగే తప్పులను విశ్లేషించుకుంటూ సన్నద్ధత కొనసాగిస్తే కోరుకున్న వర్సిటీలో ప్రవేశం పొందవచ్చు.

పరీక్ష కేంద్రాలు

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమైన ప్రాంతాల్లో పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో-24, తెలంగాణలో-11 ప్రాంతాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 19,2023 
  • పరీక్ష తేదీలు: తర్వాత ప్రకటిస్తారు.
  • వెబ్‌సైట్‌: https://cuet.nta.nic.in/
Published date : 06 Apr 2023 05:52PM

Photo Stories