Skip to main content

APPSC Recruitment: ఈ డిగ్రీ ఉంటే.. సర్కారీ కొలువు పక్కా!

ఆయుష్‌ కోర్సులు.. ఎంబీబీఎస్, బీడీఎస్‌కు ప్రత్యామ్నాయ వైద్యవిధానాలు! రోగులకు చికిత్స చేసే నైపుణ్యాలతోపాటు పేరుకు ముందు డాక్టర్‌ హోదా అందించే కోర్సులు ఇవి!! ఆయుష్‌ కోర్సులతో సమాజంలో గౌరవంతోపాటు సుస్థిర కెరీÆŠ.కు అవకాశం కల్పిస్తోంది..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం! వైద్య శాఖలో.. వేల సంఖ్యలో.. పోస్ట్‌ల భర్తీ చేపడుతున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఆయుష్‌ శాఖలోని ఆయుర్వేద, హోమియోపతి, యునానీ విభాగాల్లో.. మెడికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ).. మొత్తం 151 ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు అర్హతలు, ఎంపిక విధానం, రాత పరీక్ష, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
APPSC - Ayurveda Medical Officer Exam Preparation
APPSC - Ayurveda Medical Officer Exam Preparation
  • ఆయుష్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ 
  • ఆయుర్వేద, హోమియోపతి, యునానీలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లు
  • ఈ విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు
  • రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా నియామకం ఖరారు

సంప్రదాయ డిగ్రీల నుంచి ఇంజనీరింగ్, మెడికల్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల వరకు.. ఏ కోర్సు చదివినా.. సర్కారీ కొలువులో చేరాలని చాలామంది కలలు కంటారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆయుష్‌ కోర్సులుగా పేర్కొనే ఆయుర్వేద, హోమియోపతి,
యునానీ విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు.. ఆఫీసర్‌ హోదాతో కొలువుదీరే అవకాశం కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ఆయుష్‌ శాఖ. ఈ ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియను ఏపీపీఎస్‌సీ చేపడుతోంది. 

మొత్తం 151 పోస్టులు

  • ఏపీ ఆయుష్‌ శాఖలో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ విభాగాల్లో మొత్తం 151 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్ట్‌లన్నీ ఆయుష్‌ శాఖ పరిధిలోనే ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు ఈ శాఖలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మూడు విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు.. ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్లు–72;హోమియో మెడికల్‌ ఆఫీసర్లు–53; యునానీ మెడికల్‌ ఆఫీసర్లు–26. 

అర్హత

  • ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్లు: నాలుగున్నర ఏళ్ల వ్యవధిలో ఉండే ఆయుర్వేద డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • హోమియో మెడికల్‌ ఆఫీసర్లు: నాలుగున్నర ఏళ్ల వ్యవధిలో హోమియోపతి డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి.
  • యునానీ మెడికల్‌ ఆఫీసర్లు: నాలుగున్నర ఏళ్ల వ్యవధిలోని యునానీ డిగ్రీ కోర్సు పూర్తిచేసుకొని ఉండాలి.
  • ఆయా విభాగాల్లో డిగ్రీ స్థాయి కోర్సు ఉత్తీర్ణతతోపాటు ఒక ఏడాది కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుండాలి. 
  • అదే విధంగా శాశ్వత ప్రాతిపదికగా మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా సంబంధిత విభాగంలో నమోదు చేసుకోవాలి. 
  • వయసు: జూలై1, 2021 నాటికి 18–42ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.

రాత పరీక్ష
ఈ మూడు విభాగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు ఏపీపీఎస్‌సీ కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్షను నిర్వహించనుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగానే తుది జాబితా రూపొందిస్తుంది. పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి రిజర్వేషన్లను పరిగణనలోకి
తీసుకుంటూ నియామకాలు ఖరారు చేస్తారు.. 

పరీక్ష విధానం

  • ఈ మూడు విభాగాలకు సంబంధించి రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 

ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్లు రాత పరీక్ష

పేపర్‌ మార్కులు ప్రశ్నలు
పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ) 150 150
పేపర్‌–2(సంబంధిత సబ్జెక్ట్‌ పేపర్‌) 300  150
మొత్తం మార్కులు 450  

                

హోమియో మెడికల్‌ ఆఫీసర్లు రాత పరీక్ష

పేపర్‌ మార్కులు ప్రశ్నలు
పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ) 150 150
పేపర్‌–2(సంబంధిత సబ్జెక్ట్‌ పేపర్‌) 300 150
మొత్తం మార్కులు  450  


యునానీ మెడికల్‌ ఆఫీసర్లు రాత పరీక్ష

పేపర్‌ మార్కులు ప్రశ్నలు
పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ) 150 150
పేపర్‌–2(సంబంధిత సబ్జెక్ట్‌ పేపర్‌) 300 150
మొత్తం మార్కులు 450  

 

  • ఈ మూడు విభాగాల రాత పరీక్షలు పూర్తిగా ఇంగ్లిష్‌లోనే జరుగుతాయి. ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. 
  • నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు(1/3) తగ్గిస్తారు.

జనరల్, సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌పై పట్టు
ఆయుష్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల అభ్యర్థులు పరీక్షలో విజయం సాధించాలంటే.. జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలు, అదే విధంగా బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో తాము చదువుకున్న సబ్జెక్ట్‌లపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలి. 

జనరల్‌ స్టడీస్‌కు ఇలా

  • పేపర్‌–1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (150 మార్కులు)మూడు విభాగాల్లోనూ ఉంది. 
  • రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాలు, కళలు, క్రీడలు, సంస్కృతి, పాలనకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య అంశాలపై పట్టు సాధించాలి..
  • కరెంట్‌ ఆఫైర్స్‌కు సంబంధించి.. పరీక్షకు నెల రోజుల ముందు నుంచి అంతకుముందు సంవత్సర కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై దృష్టి పెట్టాలి.
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కొత్త పథకాలు, నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. 
  • వైద్య శాఖకు సంబంధించిన పరీక్ష కావడంతో.. దాదాపు గత రెండేళ్లుగా ప్రజలను వేధిస్తున్న కరోనాపై పూర్తిస్థాయి సమాచారం కలిగి ఉండాలి.
  • ఆంధ్రప్రదేశ్‌ చరిత్రకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆధునిక భారతదేశ చరిత్రలోని ముఖ్యమైన అంశాలపై పట్టు సాధించాలి.
  • పాలిటీ, గవర్నెన్స్‌కు సంబంధించి.. రాజ్యాంగ పీఠిక నుంచి తాజాగా ప్రవేశ పెట్టిన పరిపాలన విధానాలు, ఈ–గవర్నెన్స్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పరిపాలన పరమైన నూతన విధానాలను పత్యేక దృష్టితో చదవాలి.
  • ఆర్ధికాభివృద్ధికి సంబంధించి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశ ఆర్థిక ప్రగతి, ఆర్థికాంశాల క్రమాన్ని తెలుసుకోవాలి. 
  • జాగ్రఫీకి సంబంధించి భారత ఉపఖండంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సహజ వనరులు, అవి లభించే ప్రాంతాలు, అభివృద్ధికి అవి దోహదపడే తీరు తదితర విషయాలు చదవాలి. 
  • ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తాజా పరిణామాలు, ప్రాథమిక లక్ష్యాల గురించి అవగాహన పెంచుకోవాలి.
  • మెంటల్‌ ఎబిలిటీ విషయంలో.. లాజికల్‌ రీజనింగ్, డేటాలు, ఫ్లో చార్ట్స్, డేటా విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవాలి.
  • అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన అనంతర పరిణామాలు, సమస్యలపై ప్రత్యేక దృష్టితో అధ్యయనం సాగించాలి.
  • వీటితోపాటు 2021–22 బడ్జెట్‌లోని ముఖ్యమైన అంశాలు, ఏపీ, ఇండియా సోషియో– ఎకనామిక్‌ సర్వేలు–వాటిలో పేర్కొన్న ముఖ్య వివరాలను, గణాంకాలను అవుపోసన పట్టాలి.

సబ్జెక్ట్‌ పేపర్‌లో రాణించేలా

  • మూడు విభాగాల్లోనూ సబ్జెక్ట్‌ పేపర్‌గా ఉండే పేపర్‌–2లో రాణించాలంటే.. అభ్యర్థులు తాము పూర్తి చేసుకున్న కోర్సుకు సంబంధించి బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలోని అన్ని అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. ముఖ్యంగా ఆయా విభాగాల్లో అనుసరిస్తున్న వైద్య విధానాలు, చికిత్స పద్ధతులపై అవగాహన పెంచకోవాలి.
  • ప్రిపరేషన్‌ ప్రారంభానికి ముందే సిలబస్‌ను పరిశీలించడం ద్వారా.. డిగ్రీ స్థాయిలో తాము చదివిన సబ్జెక్ట్‌ అంశాలు, ఇంకా కొత్తగా చదవాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. అదే విధంగా పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో(బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో) నిర్వహిస్తున్నప్పటికీ.. అభ్యర్థులు డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో చదివితేనే ప్రశ్న ను ఏ విధంగా అడిగినా సమాధానం గుర్తించే సంసిద్ధత లభిస్తుంది అంటున్నారు నిపుణులు.

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 25.10.2021
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 24.10.2021 

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

Published date : 06 Oct 2021 06:53PM

Photo Stories