Skip to main content

CLAT 2022: ప్రిపరేషన్‌ పక్కాగా..

ఒకే సంవత్సరంలో రెండు సార్లు క్లాట్‌ అనేది 2022కు మాత్రమే
How to Prepare for CLAT Exam
How to Prepare for CLAT Exam

క్లాట్‌–యూజీ
ఇంటర్మీడియెట్‌ అర్హతగా ఇంటిగ్రేటెడ్‌ బీఏఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే క్లాట్‌–యూజీ పరీక్షలో అయిదు విభాగాలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 28–32 ప్రశ్నలు; జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌పై 35–39 ప్రశ్నలు; లీగల్‌ రీజనింగ్‌ నుంచి 35–39 ప్రశ్నలు; లాజికల్‌ రీజనింగ్‌లో 28–32 ప్రశ్నలు; క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌పై 13–17 ప్రశ్నలు అడుగుతారు.

Also read: CLAT 2022: క్లాట్‌ రెండుసార్లు.. అందుకే!

ప్రిపరేషన్‌ టిప్స్‌

  • క్లాట్‌ యూజీలో.. అభ్యర్థుల్లోని భాష నైపుణ్యాలను పరీక్షించే ఇంగ్లిష్‌లో రాణించేందుకు బేసిక్‌ గ్రామర్‌పై పట్టు సాధించాలి. టెన్సెస్, సెంటెన్స్‌ ఫార్మేషన్, సెంటెన్స్‌ కరెక్షన్, యాక్టివ్‌ అండ్‌ ప్యాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌–ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌ వంటివి అధ్యయనం చేయాలి. దాంతోపాటు కాంప్రహెన్షన్, ప్యాసేజ్‌ రీడింగ్‌పై అవగాహన పెంచుకోవాలి. వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. తద్వారా ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించే సామర్థ్యం లభిస్తుంది. ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నల్లో స్కోర్‌ చేసేందుకు సునిశిత పరిశీలన దృక్పథం అవసరం. 
  • కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి.. సమకాలీన పరిణామాలు, కళలు, సంస్కృతి, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రాధాన్యత కలిగిన చారిత్రక అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు జాతీయోద్యమంలోని కీలక ఘట్టాలపై దృష్టి పెట్టాలి. భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకు అన్నీ తెలుసుకోవాలి. కరెంట్‌ అఫైర్స్‌లో రాణించేందుకు అంతర్జాతీయ సంబంధాలు–ద్వైపాక్షిక ఒప్పందాలు, ముఖ్యమైన సంఘటనలు, సదస్సుల గురించి పూర్తి అవగాహన అవసరం. ప్రామాణిక జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాలతోపాటు, ప్రతిరోజు దినపత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. 
  • లీగల్‌ రీజనింగ్‌కు సంబంధించి ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు అడగనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఆ ప్యాసేజ్‌ల నుంచి నిబంధనలు, సిద్ధాంతాలు, ఫ్యాక్ట్స్, వాటి ద్వారా చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల న్యాయపరమైన దృక్పథం, సహేతుక ఆలోచన ధోరణి, నిర్ణయ సామర్థ్యాలను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఎదురవుతాయి. నిర్దిష్టంగా ఒక సమస్య లేదా వివాదాన్ని పరిష్కరించేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ముఖ్యమైన చట్టాలు, న్యాయ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, లీగల్‌ టెర్మినాలజీపై అవగాహన పెంచుకోవాలి. 
  • లాజికల్‌ రీజనింగ్‌లో.. అభ్యర్థుల్లోని తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు; అసెర్షన్‌ అండ్‌ రీజనింగ్‌ ప్రశ్నలు ఉంటాయి. ఇందుకోసం సిలాజిజమ్, కోడింగ్‌–డీ కోడింగ్, డైరెక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ వంటి అంశాలపై పట్టు సాధించాలి. స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నల కోసం కంపేరిటివ్‌ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. 
  • క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగంలో.. మంచి మార్కులు సాధించాలంటే.. ముందుగా పదో తరగతి స్థాయిలోని గణిత అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. అర్థమెటిక్‌కు కొంత ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. కాబట్టి పర్సంటేజెస్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ స్పీడ్, యావరేజ్, రేషియో తదితర అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. గ్రాఫ్‌లు, చార్ట్‌లను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.

Also read: ఎన్నో స‌మస్యలకు ప‌రిష్కారాలు చూపే.. లా కోర్సుల ప్ర‌వేశ ప‌రీక్షల గురించి తెలుసుకోండిలా..

క్లాట్‌–పీజీ పరీక్ష విధానం

  • బీఏ ఎల్‌ఎల్‌బీ అర్హతగా ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే క్లాట్‌–పీజీని ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ రెండు విధానాల్లోనూ నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, మరో 50 మార్కులకు రెండు ఎస్సే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష రెండు విభాగాల్లో ఉంటుంది. 
  • మొదటి విభాగంలో..కాన్‌స్టిట్యూషనల్‌ లా సంబంధిత ప్రశ్నలు;రెండో విభాగంలో..జ్యూరిస్పుడెన్స్, అడ్మినిస్ట్రేటివ్‌ లా, లా ఆఫ్‌ కాంట్రాక్ట్, టార్ట్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్‌ లా, ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ లా, ట్యాక్స్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ లా, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఎలాంటి ఇబ్బంది ఉండదు
క్లాట్‌ను వచ్చే ఏడాది నుంచి డిసెంబర్‌లోనే నిర్వహించాలనే నిర్ణయం వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు మరింత వెసులుబాటు లభించినట్లవుతుంది. ఆ సమయంలో ఇతర ఎంట్రన్స్‌లు ఉండవు. కాబట్టి క్లాట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది. ఒకే సంవత్సరంలో రెండు సార్లు క్లాట్‌ అనేది 2022కు మాత్రమే. అది కూడా మేలో నిర్వహించే క్లాట్‌.. 2022 ప్రవేశాలకు; డిసెంబర్‌లో నిర్వహించే క్లాట్‌.. 2023 ప్రవేశాలకు ఉద్దేశించినవి. 
–ప్రొ‘‘ వి.బాలకిష్టారెడ్డి, రిజిస్ట్రార్, నల్సార్‌–హైదరాబాద్‌
 

Click here for more  Law Law

Published date : 30 Nov 2021 03:08PM

Photo Stories