Skip to main content

ఎన్నో స‌మస్యలకు ప‌రిష్కారాలు చూపే.. లా కోర్సుల ప్ర‌వేశ ప‌రీక్షల గురించి తెలుసుకోండిలా..

దేశంలో న్యాయ విద్యను అభ్యసించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వ్యక్తులు తమకు అన్యాయం జరిగిందని భావించినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు.

 గ్రామంలోని గట్టు పంచాయతీ నుంచి అంతర్జాతీయంగా వ్యాపార లావాదేవీలు, దేశాల మధ్య సరిహద్దు వివాదాల వరకూ.. న్యాయస్థానాలు సమస్యల పరిష్కారానికి తీర్పులను ఇస్తుంటాయి. ఆయా సమస్యలపై వాదులు, ప్రతివాదుల తరపున వాదనలు వినిపించే వారే న్యాయవాదులు. ఇంటర్, డిగ్రీ తర్వాత విద్యార్థులకు అందుబాటులో ఉన్న వివిధ లా కోర్సులు, ఎంట్రెన్స్‌లపై కథనం.. 


క్లాట్‌..

  • జాతీయస్థాయిలో ఇంజనీరింగ్‌ విద్యకు ఐఐ టీలు, మేనేజ్‌మెంట్‌ విద్యకు ఐఐఎంలకు ఎంతటి గుర్తింపు ఉందో.. న్యాయ విద్యకు సంబంధించి నేషనల్‌ లా యూనివర్సిటీ(ఎన్‌ఎల్‌యూ)లకు కూడా అంతటి మంచి పేరుంది. ఈ నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ) ల్లో.. ఎందులో ప్రవేశం పొందినా.. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పొచ్చు. హైదరాబాద్‌లో నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా ఉంది. 
  • నేషనల్‌ లా యూనివర్సిటీలు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీతో పాటు ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తున్నాయి. 
  • దేశవ్యాప్తంగా ఉన్న 22 ఎన్‌ఎల్‌యూల్లో కలిపి దాదాపు 2600 ఎల్‌ఎల్‌బీ సీట్లు, అలాగే 800 ఎల్‌ఎల్‌ఎం సీట్లు ఉంటాయి. ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియెట్‌/10+2లో కనీసం 45శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీలకు 40 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ఎల్‌ఎల్‌ఎం కోసం క్లాట్‌ పీజీకి దరఖాస్తు చేసుకునేందుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చే సి ఉండాలి. 
  • దేశంలో ఉన్న అన్ని ఎన్‌ఎల్‌యూల్లో యూజీ స్థాయి కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడిగా నిర్వహించే పరీక్ష.. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌(క్లాట్‌–సీఎల్‌ఏటీ). 
  • క్లాట్‌ పరీక్ష ఆఫ్‌లైన్‌లో పెన్, పేపర్‌ విధానంలో నిర్వహిస్తారు. క్లాట్‌ యూజీ పరీక్ష మొత్తం 150 మార్కులకు 2 గంటల కాలవ్యవధితో నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కుల కోత విధిస్తారు.
  • ఈ పరీక్షలో మొత్తం ఐదు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌పై 28–32 ప్రశ్నలు, కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 35–39 ప్రశ్నలు, లీగల్‌ రీజనింగ్‌ నుంచి 28–32 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ విభాగం నుంచి 13–17 ప్రశ్నలు వస్తాయి.
  • ఎన్‌ఎల్‌యూ సీటు రావాలంటే..150 మార్కులకు గాను 115 మార్కులకు పైగా∙సాధించాలని నిపుణులు పేర్కొంటున్నారు.
  • దేశంలో ఉన్న దాదాపు 25కు పైగా ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు కూడా క్లాట్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
  • ఈ ఏడాదికి సంబంధించి మే 9న జరగాల్సిన క్లాట్‌ కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఆసక్తి గల విద్యార్థులు జూన్‌ 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు.
  • పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in

ఇంకా చ‌ద‌వండి : part 2 :  నేషనల్‌ లా యూనివర్సిటీలో ప్రవేశాల‌కు.. ఏఐఎల్‌ఈటీ ఎంట్రన్స్ టెస్ట్ వివ‌రాలు ఇవే..

Published date : 31 May 2021 04:33PM

Photo Stories