నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలకు.. ఏఐఎల్‌ఈటీ ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు ఇవే..
Sakshi Education
నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీలో అందుబాటులో ఉన్న అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష.. ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్(ఏఐఎల్‌ఈటీ).
- ఏఐఎల్‌ఈటీ 2021 స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పించే బీఏ ఎల్‌ఎల్‌బీ సీట్ల సంఖ్య 110(ఫారిన్ నేషనల్స్ కోసం అదనంగా మరో 10సీట్లు). అలాగే ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు సంబంధించి 70సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయినా ఈ యూనివర్సిటీలో లా కోర్సులో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా వేల మంది పోటీ పడుతుంటారు.
- దేశంలో ఇతర ఎన్‌ఎల్‌యూల్లో లేని గొప్ప అవకాశం ఢిల్లీ ఎన్‌ఎల్‌యూలో ఉంది. ఇక్కడ కోర్సులో ప్రవేశం లభిస్తే..సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు వంటి ప్రధాన కోర్టుల్లో పనిచేసే న్యాయ నిపుణుల ప్రసంగాలు వినే అవకాశం లభిస్తుంది. ఇందుకోసమే తక్కువ సీట్లు ఉన్నప్పటికీ.. దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రతిభావంతులు ఈ పరీక్షకు పోటీ పడుతుంటారు.
- ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యలో కనీసం 50శాతం మార్కులు పొందిన వారు మాత్రమే ఏఐఎల్‌ఈటీ పరీక్ష దరఖాస్తుకు అర్హులు. అలాగే ఎల్‌ఎల్‌ఎం కోసం కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులవ్వాలి.
- బీఏ ఎల్‌ఎల్‌బీలో ప్రవేశం కోసం నిర్వహించే ఏఐఎల్‌ఈటీ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో (పెన్, పేపర్) 150 మార్కులు–150 ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ఐదు విభాగాల నుంచి ఎంసీక్యూ పద్దతిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం గంటన్నర. ప్రతి సరైన సమాధానానికి ఒక్క మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోతగా విధిస్తారు. ఇంగ్లిష్– 35 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్–35 ప్రశ్నలు, లీగల్ ఆప్టిట్యూడ్–35, రీజనింగ్–35, మ్యాథమెటిక్స్–10 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఎల్‌ఎల్‌ఎం పరీక్ష ప్యాట్రన్ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- ఏఐఎల్‌ఈటీ 2021కు దరఖాస్తులకు చివరి తేది: జూన్ 25, 2021
- దరఖాస్తులకు వెబ్‌సైట్: https://cdn.digialm.com/EForms/configuredHtml/511/69353/Index.html
ఎల్‌శాట్ (ఎల్‌ఎస్‌ఏటీ)..
- దేశ వ్యాప్తంగా ఉన్న ప్రవేట్ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష.. లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్(ఎల్‌శాట్–ఎల్‌ఎస్‌ఏటీ). ది లా స్కూల్ ఆఫ్ అడ్మిషన్ కౌన్సిల్ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు దేశ వ్యాప్తంగా పలు లా స్కూళ్లల్లో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. దేశంలో 50కిపైగా విద్యాసంస్థలు ప్రవేశం కల్పిస్తున్నాయి. దీనికి అర్హత 10+2/ఇంటర్మీడియెట్.
- ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. 92 ప్రశ్నలకు గాను 2గంటల 20 నిమిషాల పరీక్ష సమయం ఉంటుంది. మొత్తం 4 నాలుగు సెక్షన్‌లుగా ఒక్కో సెక్షన్‌కు 35 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు.నెగిటివ్ మార్కులు లేవు.
ఏపీ లాసెట్–టీఎస్ లాసెట్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లోని లా కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం ఏపీ లాసెట్, టీఎస్ లాసెట్‌లను నిర్వహిస్తున్నాయి.
- మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసినవారై ఉండాలి.
- ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సును అభ్యసించాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి.
- టీఎస్ లాసెట్‌కు దరఖాస్తులకు చివరి తేది జూన్ 3, 2021.
ఇంకా చదవండి : part 2 : ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపే.. లా కోర్సుల ప్రవేశ పరీక్షల గురించి తెలుసుకోండిలా..
Published date : 31 May 2021 04:38PM