Skip to main content

క్లాట్‌–2021 గడువు పెంపు.. పూర్తి వివ‌రాలు తెలుసుకోండిలా..

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో (నేషనల్‌ లా యూనివర్సిటీస్‌) ప్రవేశాలకు ఉద్దేశించిన ‘కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌–2021’ (క్లాట్‌)కు దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ కన్సార్టియం పొడిగించింది.

అభ్యర్థులు ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, ఎంట్రన్స్‌ను జూన్‌ 13న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘క్లాట్‌’ వివరాలు..

క్లాట్‌ (CLAT) అంటే..

  • క్లాట్‌.. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌. ఇది దేశవ్యాప్తంగా ఉన్న 22 నేషనల్‌ లా యూనివర్సిటీలతోపాటు ఇతర కాలేజీలు/విశ్వవిద్యాలయాల్లో లా (యూజీ, పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంట్రెన్స్‌ టెస్ట్‌.
  • ఓఎన్‌జీసీ, బీహెచ్‌ఈఎల్‌ వంటి పలు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తమ న్యాయ విభాగంలో సిబ్బంది నియామకాల కోసం క్లాట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
  • 2018 వరకు క్లాట్‌ ఎంట్రన్స్‌ను నేషనల్‌ లా యూనివర్సిటీలు రొటేషనల్‌ ప్రాతిపదికగా నిర్వహించేవి, 2019లో ప్రత్యేక గవర్నింగ్‌ బాడీ ద్వారా నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ కన్సార్టియంను ఏర్పాటు చేశారు. దీన్నే ‘క్లాట్‌ కన్సార్టియం’గా పిలుస్తారు. అప్పటి నుంచి కన్సార్టియం ఆఫ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ ద్వారా ఈ ఎంట్ర¯Œ్స టెస్ట్‌ నిర్వహిస్తున్నారు.

క్లాట్‌తో ప్రవేశం..
క్లాట్‌ ద్వారా ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ మినహా ఇతర జాతీయ లా యూనివర్సిటీలు, ప్రముఖ కాలేజీల్లో ఐదేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ లా కోర్సులు, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులు అభ్యసించవచ్చు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో– బీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ, బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ,–బీఎస్‌డబ్య్లూ ఎల్‌ఎల్‌బీ కోర్సులు; అలాగే పీజీ స్థాయిలో ఎల్‌ఎల్‌ఎం (మాస్టర్‌ ఆఫ్‌ లా) కోర్సుల్లో చేరొచ్చు.

ఎంట్రన్స్‌కు అర్హతలు..

  • అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు క్లాట్‌ను వేర్వేరుగా నిర్వహిస్తారు. వీటికి అర్హతలు సైతం వేర్వేరుగా ఉన్నాయి.
  • యూజీ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమానమైన అర్హత ఉండాలి. మే/జూన్‌లో పరీక్షలు రాస్తున్నవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు జనరల్‌/బీసీ విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో కనీసం 45 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. క్లాట్‌–2021కు దరఖాస్తు చేయడానికి ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు.
  • పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్‌/ఓబీసీ కేటగిరీకి చెందినవారు లా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి చెందినవారు కనీసం 45 శాతం మార్కులు పొందాలి. పీజీ క్లాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

క్లాట్‌ యూజీ పరీక్ష విధానం..

  • క్లాట్‌ యూజీ, పీజీ ఎంట్ర¯Œ్సను వేర్వేరుగా ‘ఆఫ్‌లైన్‌’(పెన్‌ అండ్‌ పేపర్‌) విధానంలో నిర్వహిస్తారు.
  • అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) కోర్సుల క్లాట్‌ పరీక్ష 150 ప్రశ్నలు–150 మార్కులకు జరుగుతుంది. మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ (కాంప్రహెన్షన్‌తో కలిపి) 28–32 ప్రశ్నలు, కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 35–39 ప్రశ్నలు, లీగల్‌ రీజనింగ్‌ నుంచి 35–39 ప్రశ్నలు, లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 28–32 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ నుంచి 13–17 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 శాతం మార్కు తగ్గిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు.

పీజీ ఎంట్రెన్స్‌..

  • క్లాట్‌ పీజీ ఎంట్ర¯Œ్స ఎగ్జామ్‌ మొత్తం 150 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో కాన్‌స్టిట్యూషనల్‌ లా–40 మార్కులకు, కాంట్రాక్ట్, ట్రాట్స్, క్రిమినల్‌ లా, ఇంటర్నేషల్‌ లా, ఐపీఆర్‌ అండ్‌ జ్యూరిస్‌ప్రూడె¯Œ్స, ఇతర లా సబ్జెక్టుల నుంచి 60 మార్కులకు ప్రశ్నలుంటాయి. రెండో సెక్షన్‌లో రెండు డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు.. వర్తమాన న్యాయ సంబంధ అంశాలపై అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 25 మార్కుల చొప్పున కేటాయించారు. ఒక్కో డిస్క్రిప్టివ్‌ ప్రశ్నకు 800 పదాల్లో జవాబులు రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల్లో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున తగ్గిస్తారు. పీజీ ఎంట్ర¯Œ్సలో సెక్షన్‌–1లో ప్రతి అభ్యర్థి 40 శాతం మార్కులు(ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులు 35 శాతం) సాధిస్తేనే.. రెండో సెక్షన్‌ (డిస్క్రిప్టివ్‌ జవాబులు)మూల్యాంకనం చేస్తారు.

ముఖ్య సమాచారం..

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021
  • దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.4వేలు, ఎస్సీ/ఎస్టీ/అభ్యర్థులకు రూ.3500.
  • క్లాట్‌ పరీక్ష తేది: 13 జూన్‌ 2021
  • వివరాలు, ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in/clat-2021  
Published date : 14 Apr 2021 04:52PM

Photo Stories