Awareness Program : కెరీర్ గైడెన్స్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు.. ఐటీడీఏ పీవో సూచనలు!
పాడేరు: విద్యార్థి దశలో కెరీర్ గైడెన్స్ పాత్ర కీలకమని పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ సూచించారు. గుత్తులపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో సూపర్ 50 పేరిట విద్యార్థులకు అందిస్తున్న బోధన విధానాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల ప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పది తరువాత ఇంటర్‌లో ఎలాంటి గ్రూపులు తీసకోవాలో ఆయన వివరించారు. డిగ్రీ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలిపారు.
TGPSC Group 1 Exam: రోడ్డెక్కిన గ్రూప్–1 అభ్యర్థులు.. పరీక్షలు సజావుగా జరిగేనా?
బైపీపీలో చేరితే అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్‌పై దృష్టి సారిస్తే మంచి అవకాశాలు వస్తాయన్నారు. పది తరువాత ఐటీఐ/పాలిటెక్నికల్ కోర్సులు చేస్తే సాంకేతికంగా అవకాశాలు ఉంటాయన్నారు. ఉన్నతస్థానాల్లో ఉండాలన్న లక్ష్యం ఉంటే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలు రాస్తే ఏఐఎస్ సర్వీసులకు ఎంపిక అవుతారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీడీ రజని పాల్గొన్నారు.
AFTA : రేపు ఆప్టా 2వ రాష్ట్ర కౌన్సెల్ సమావేశం
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)