Skip to main content

మెరుగైన‌ భవిష్యత్‌కు...విలువైన మల్టీడిసిప్లినరీ కోర్సు..

ఇప్పుడు బహుళ నైపుణ్యాలు ఉన్న వారికే జాబ్‌ మార్కెట్‌ పెద్ద పీట వేస్తోంది. అందుకే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మల్టీడిసిప్లినరీ ట్రెండ్‌ కొనసాగుతోంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే ఇలాంటి కోర్సులు పూర్తిచేసిన వారి కొరత నెలకొంది. దీన్ని గుర్తించిన కడపలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ.. పలు మల్టీడిసిప్లినరీ కోర్సులను ప్రవేశ పెట్టింది. వాటిల్లో ప్రధానమైనది.. బీటెక్‌ ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌(ఎఫ్‌ఎస్‌పీ)!!
multidisciplinary course
multidisciplinary course

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ కోసం 2020 సంవత్సరంలో  రూ.452 కోట్ల వ్యయంతో 134 ఎకరాల్లో కడపలో.. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. ఈ యూనివర్సిటీ అనేక మల్టీ డిసిప్లినరీ కోర్సులను అందిస్తోంది. వీటిల్లో ఒకటి.. బీటెక్‌ ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌(ఎఫ్‌ఎస్‌పీ). ఈ కోర్సును బిల్డింగ్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ ఇంజనీరింగ్‌గా కూడా పేర్కొంటారు. 

ప్రత్యేకతలు..
గతంలో ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌ వంటì మల్టీడిసిప్లినరీ కోర్సుల కోసం మన విద్యార్థులు విదేశాలకు వెళ్లేవారు. కాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఇలాంటి వినూత్న కోర్సులను అందిస్తోంది. ముఖ్యంగా బీటెక్‌ ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌ అనేది.. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల కలయికతో కూడిన కోర్సు. అందుకే దీన్ని మల్టీడిసిప్లినరీ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌గా పేర్కొంటున్నారు. 

ఈ కోర్సుతో..పాటు
ఈ కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. ఈ కోర్సు ద్వారా విద్యార్థికి భవన నిర్మాణం, సౌకర్యాల కల్పన, సౌకర్యాల నిర్వహణ వంటి అనేక విభాగాలపై చక్కటి నైపుణ్యం వస్తుంది. దీంతోపాటు ఈ కోర్సు చదివిన విద్యార్థులు.. ల్యాండ్‌ స్కేప్‌ డిజైన్, బిల్డింగ్‌ ప్లానింగ్, హెచ్‌వీఏసీ డిజైన్, యంఈసీ సర్వీసెస్, సస్టెయినబుల్‌ అండ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ డిజైన్‌ , వాటర్‌ సప్లయ్‌ మేనేజ్‌మెంట్, ఎస్‌టీపీ, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్, గ్రీన్‌ బిల్డింగ్స్, ఎనర్జీ మేనేజ్‌మెంట్, ఎనర్జీ అడిట్, రెన్యూవబుల్‌ ఎనర్జీ, బిల్డింగ్‌ డిజైన్‌ విత్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ–సెక్యూరిటీ, సర్వీసెస్‌ ఇన్‌ హైరైజ్‌ బిల్డింగ్స్, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్, మెకానికల్‌ సర్క్యులేషన్‌ సిస్టమ్స్, డిజైన్‌ స్టూడియోస్‌ వంటి అనేక అంశాలపై అవగాహన పొందుతారు. 

అర్హతలు–ప్రవేశ విధానం ఇలా..
ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ/10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ ఈఏపీసెట్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. 

కోర్సు ఫీజు :  రూ.35000. 

ఉద్యోగాలు
బీటెక్‌ ఎఫ్‌ఎస్‌పీ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో అవకాశాలు లభిస్తాయి. ఎంఎన్‌సీలు, ఐటీ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్కిటెక్చర్‌/నిర్మాణ కంపెనీలు, మెట్రో రైలు, నిఘా విభాగాల్లో సైట్‌ ఇంజనీర్లు, ఫెసిలిటీస్‌ మేనేజర్లుగా ఉద్యోగాలు లభిస్తాయి. వీటితోపాటు వీరు ప్రాజెక్ట్‌ మేనేజర్, హెచ్‌వీఏసీ ఇంజనీర్, ఐజీబీసీ అక్రిడిటెడ్‌ ప్రొఫెషనల్, సేఫ్టీ సైట్‌ ఆఫీసర్, ఎంఈపీ ఇంజనీర్, ఫెసిలిటీస్‌ ప్లానర్, బీఐఎం ఇంజనీర్‌ వంటి కొలువులు సొంతం చేసుకోవచ్చు. 

చక్కటి అవకాశాలు ఇలా..
ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌ కోర్సు తర్వాత ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు చక్కటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బిల్డింగ్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఎనర్జీ మేనేజ్‌మెంట్, రెన్యువబుల్‌ ఎనర్జీ, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కన్సట్రక్షన్‌ మేనేజ్‌మెంట్, హెచ్‌వీఏసీ ఇంజనీరింగ్, ఆటోమేషన్‌ ఇంజనీరింగ్, అర్బన్‌ ప్లానింగ్‌ వంటి వాటిలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసుకోవచ్చు. అనంతరం పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ysrafu.ac.in


అవసరాలకు తగ్గ కోర్సు ఎఫ్‌ఎస్‌పీ..
ఇంజనీరింగ్‌లో ఎన్నో భావనల కలయిక బీటెక్‌ ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌(ఎఫ్‌ఎస్‌పీ) కోర్సు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు రూపుదిద్దుకున్న కోర్సు ఇది. దీన్ని నెట్‌ జీరో ఎనర్జీ బిల్డింగ్స్‌ని రూపొందించే నిపుణులను తయారు చేసే ప్రోగ్రామ్‌గా చెప్పొచ్చు.
–షైక్‌ ముహమ్మద్‌ అన్సారీ (ఫ్యాకల్టీ, ఎఫ్‌ఎస్‌పీ డిపార్ట్‌మెంట్,డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏఎఫ్‌యూ)
 

Published date : 03 Sep 2021 03:31PM

Photo Stories