Women Entrepreneurs Conference: ఔత్సాహికులకు దిశానిర్దేశం
నేను విజయనగరంలో ఆన్‌లైన్ ద్వారా మరింత మెరుగ్గా టీచింగ్ ఎలా చేయాల న్న దానిపై సాఫ్ట్‌వేర్ ప్రాడక్టును తయారు చేశాను. ఇది మంచి ఫలితాలనిస్తోంది. గూగుల్‌కు అంబాసిడర్‌గా నూ ఉన్నాను. గూగుల్ తరఫున ‘స్టార్టప్ సక్సెస్ డేస్’కు పనిచేస్తున్నాను. ఈ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు ద్వారా స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్, ఎవరితో సంప్రదించాలి? సరైన మార్గంలో వెళ్తున్నామా? వంటి ఎన్నో అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకునే వీలు కలిగింది. ఈ సదస్సు కొత్తవారితోపాటు ప్రస్తుతం నడుపుతున్న వారికీ ఎంతో ఉపయోగపడుతుంది.
– వేమూరి ఉషా రమణి, ఫౌండర్, ‘గురుజాడ’ ఐటీ సొల్యూషన్స్, విజయనగరం
చదవండి: Andhra Pradesh: మూడు పరిశ్రమలు.. వేలాది మందికి ఉద్యోగావకాశాలు
స్టార్టప్ స్టార్స్
నేను తిరుపతి నుంచి ఈ సదస్సుకు వచ్చాను. మా స్టార్టప్ కంపెనీ ద్వారా స్కూళ్లకు యూకేలో మాదిరిగా సర్వీసులను ప్రొవైడ్ చేస్తున్నాం. మహిళా పారిశ్రామికవేత్తల కోసం నిర్వహించిన ఈ సదస్సులో ఎన్నో విషయాలు తెల్సుకున్నాను. ఈ సదస్సు స్టార్టప్ కంపెనీల నిర్వాహకులకు మంచి ప్లాట్‌ఫాం. మాలాంటి వారెందరికో ప్రయోజనం చేకూరుతుంది. మునుపటి ప్రభుత్వాల్లా కాకుండా ఈ ప్రభుత్వం సదస్సుల్లో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు కార్యాచరణలో పెడుతోంది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మేం ఎంఓయూ కుదుర్చుకున్నాం.
– జి.శశిరేఖ, ఎడ్వెంచర్ స్కూల్ ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి
ఏపీఐఎస్‌తో ఎంఓయూ
మహిళలు, ఇతరులు నడుపుతున్న స్టార్ట ప్ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలే కాదు.. సాధించిన విజయాలను, నిర్వాహకుల అనుభవాలను తెలుసుకునే వీలు ఈ సదస్సు ద్వారా కలిగింది. అంతేకాదు.. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవే త్తలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పాటు మెలకు వలపై అధికారులు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఇ లాంటి సదస్సులు స్టార్టప్ కంపెనీల నిర్వాహకులకు ఎంతో ప్రయోజనకరం. ఈ రోజు సదస్సులో ఏపీ ఇన్నోవేషన్ సొసై టీ (ఏపీఐఎస్)తో హెడ్ స్టార్ట్ నెట్‌వర్క్ ఫౌండేషన్ పేరిట ఎంఓయూ కుదుర్చుకున్నాం.
– అశ్వథి వేణుగోపాల్,
చదవండి: Schools and Colleges: పాఠశాలలు ఆధునిక దేవాలయాలు
ఆలోచనల ఆచరణకు దోహదం
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సు వల్ల సాటి స్టార్టప్ కంపెనీల నిర్వాహకులు ఒకరికొకరు ఆలోచనలు పంచుకోవడానికి, అవి సరైన రీతిలో కార్యరూపం దాల్చడానికి, నైపుణ్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుంది. నెట్‌వర్క్ విస్తృతం అవుతుంది. మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న సహకారం, పథకాలు, వాటిని ఎలా పొందవచ్చో తెలుస్తుంది. ఆధునిక సాంకేతికత, గ్లోబల్ పొజిషనింగ్ గురించి మరింత అవగాహన కలుగుతుంది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన ఆలోచనతో స్టార్టప్ కంపెనీ ద్వారా మెడెక్స్ ఫోర్స్ పేరిట మెడికల్ యాప్ ద్వారా నర్సింగ్ సేవలందిస్తున్నాం.
– శ్రీనిజ రామచంద్ర, ఆర్‌క్యూబీ టెక్నాలజీస్, విశాఖపట్నం