Skip to main content

ADCET Notification: ఉజ్వల కెరీర్‌కు కళాత్మక కోర్సులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడపలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ(డా.వైఎస్‌ఆర్‌ఏఎఫ్‌యూ).. వివిధ ఫైన్‌ ఆర్ట్స్, డిజైన్‌ కోర్సులను అందిస్తోంది. వీటిల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం ఏపీ ఉన్నత విద్యామండలి.. ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌)-2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ వివరాలు..
ADCET Notification

అందించే కోర్సులు

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌), బ్యా­చిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ) ఇన్‌ పెయింటింగ్‌/స్కల్ప్‌చర్‌/యానిమేషన్‌/అప్లయిడ్‌ ఆర్ట్స్‌/ఫోటోగ్రఫీ.

అర్హత

10+2 లేదా ఇంటర్మీడియేట్‌(ఎంపీసీ/ఎంఈసీ/బైపీసీ/ఎంబైపీసీ/సీఈసీ/హెచ్‌ఈసీ) లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

రాత పరీక్ష ఇలా

ఏడీసెట్‌లో పొందిన ర్యాంక్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. బీఎఫ్‌ఏ, బీడిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఒకే ఉమ్మడి ప్రశ్నపత్రం ఉంటుంది. ఆన్‌లైన్‌(సీబీటీ) విధానంలో ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో పరీక్షను నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు-100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.

చ‌ద‌వండి: NATA 2023 Notification: ఆర్కిటెక్చర్‌తో.. కెరీర్‌ నిర్మించుకుంటారా!

సిలబస్‌

జనరల్‌ నాలెడ్జ్, ఆర్ట్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్, అప్లయిడ్‌ ఆర్ట్స్‌లో టెక్నికల్‌ డిటైల్స్, పెయింటింగ్, స్కల్పచర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, ఆర్ట్‌ హిస్టరీ, డిజైన్‌ స్కిల్స్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

కెరీర్‌

  • ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి.
  • ఆర్ట్‌ స్టూడియోలు, అడ్వరై్టజింగ్‌ కంపెనీలు, గ్రాఫిక్, ప్రింటింగ్, పబ్లిషింగ్, ఫ్యాషన్‌ సంస్థలు, ఎలక్ట్రానిక్‌ ఇండస్ట్రీ, టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ, ఫిల్మ్‌ అండ్‌ థియేటర్, మల్టీమీడియా, యానిమేషన్‌ తదితర సంస్థల్లో ఉద్యోగావకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఆర్ట్‌ గ్యాలరీల్లో వీరు తమ ప్రతిభను చాటవచ్చు. ఫ్రీలాన్సింగ్, స్వయం ఉపాధి(వర్క్‌షాపు నడపడం) ద్వారా ఎక్కువ మొత్తంలో సంపాదించుకునే అవకాశముంది. ఎండోమెంట్, ఆర్కియలాజికల్‌ విభాగాల్లోనూ అవకాశాలు దక్కించుకోవచ్చు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 20.05.2023
  • ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 28.05.2023
  • హాల్‌టికెట్‌ డౌన్‌లోడింగ్‌: 31.05.2023
  • వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/

చ‌ద‌వండి: కెరీర్ నిర్మాణానికి.. ఆర్కిటెక్చర్!

Published date : 24 Apr 2023 06:56PM

Photo Stories