Narendra Singh Bedi: ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ ఉద్యమకారుడు కన్నుమూత

‘యంగ్ ఇండియా ప్రాజెక్ట్’ ద్వారా నిరుపేద ప్రజలకు సేవలందించిన నరేంద్రసింగ్ బేడి జనవరి 20వ తేదీ తుదిశ్వాస విడిచారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా, శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండ మండలం గుట్టూరు గ్రామంలోని తన కార్యాలయంలో మృతి చెందారు.
పంజాబ్‌కు చెందిన నరేంద్రసింగ్ బేడి 1970 సెప్టెంబన్ 12న గుట్టూరు వద్ద ‘యంగ్ ఇండియా ప్రాజెక్టు’ స్థాపించి, పేదల కోసం అనేక సామాజిక ఉద్యమాలు నిర్వహించారు. ప్రభుత్వ భూమిని ప్రజలకు పంపిణీ చేయడం, సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని, ఆస్తిని ధారపోసిన త్యాగశీలి బేడి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.
Pritish Nandy: ప్రముఖ జర్నలిస్టు ప్రీతిష్ నంది కన్నుమూత
అతని సేవలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా విస్తరించాయి. వ్యవసాయ కూలీలకు, సామాజిక కార్యక్రమాలకు ఆయన చేసిన కృషి, ఉపాధి చట్టం రూపకల్పన మరియు అమలులో చేసిన ముఖ్యపాత్రను ప్రజాసంఘాల నాయకులు గుర్తుచేశారు.
అమెరికాలో స్థిరపడిన బేడి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు.
ఆయన చేసిన సేవలు
- ‘యంగ్ ఇండియా ప్రాజెక్టు’ ద్వారా నిరుపేద ప్రజలకు సేవలు.
- సమసమాజ స్థాపన కోసం ఉద్యమాలు.
- భూముల పంపిణీ, వ్యవసాయ కూలీలకు సేవలు.
- ఉపాధి చట్టం రూపకల్పనలో కీలక పాత్ర.