Success Story of Santhosh... Four Bank Jobs : మూడు నెలల వ్యవధిలోనే.. యూట్యూబ్ చూసి 4 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడిలా.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే..
ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే.. యూట్యూబ్‌లో..
కంటెం సంతోష్ బీటెక్ పూర్తి చేశారు. ఎంతో పట్టుదలో చదివి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు.వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన కంటెం సంతోష్ .. బ్యాంకు ఉద్యోగ ఎంపిక పరీక్షలకు కసితో చదివాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే యూట్యూబ్ క్లాస్‌లు విని పరీక్షలు రాశాడు.
వరుసగా నాలుగు ఉద్యోగాలను సాధించాడిలా.. మరో రెండు ఉద్యోగాలకు..
ఫలితంగా గత ఏడాది డిసెంబర్‌లో వరంగల్ డీసీసీబీ బ్యాంకులో క్లర్క్ పోస్టుకు అర్హత సాధించిన సంతోష్, జనవరి 1న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (ఎస్‌బీఐ స్పాన్సర్డ్)లో స్కేల్-1 అధికారిగా ఎంపికయ్యాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ (ఎస్‌బీఐ స్పాన్సర్డ్)లో క్లర్క్ పోస్టుకూ అర్హత సాధించాడు. మార్చి 10న వచ్చిన ఫలితాల్లో ఎస్‌బీఐలో జూనియర్ అసోసియేట్ పోస్టుకూ క్వాలిఫై అయ్యాడు. ఇలా వరుసగా వచ్చిన ఫలితాల్లో నాలుగు ఉద్యోగాలకు ఎంపికై నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. మరో విశేషమేమిటంటే ఆయన రాసిన మరో రెండు ఉద్యోగాల ఫలితాలు రావాల్సి ఉంది.
☛ Inspiring Success Story : మా ఊరి వాళ్లు, నా ఫ్రెండ్స్ నా ఓటమి చూసి నవ్వారు.. కానీ నేను..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో..
ప్రభుత్వ కొలువు సాధించాలంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది.. ఇటీవల కాలంలో నిర్వహించిన నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు మండల కేంద్రానికి చెందిన కంటెం సంతోష్ ఎంపికయ్యాడు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో ఆఫీస్ స్కేల్–1, ఆంధ్రప్రదేశ్ గ్రామీ ణ వికాస బ్యాంక్ క్లర్క్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్, వరంగల్ డీసీసీబీలో క్లర్క్ పోస్టులు సాధించాడు. కాగా.. నాలుగు ఉద్యోగాలకు ఎంపికైన సంతోష్‌ను గ్రామస్తులు అభినందించారు. అలాగే యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
☛ Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
కుటుంబ నేపథ్యం :
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన కంటెం పద్మ-ఏకాంతం దంపతుల కుమారుడు సంతోష్. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో బ్యాంకు ఉద్యోగ నియామక పరీక్షకు సిద్ధమయ్యారు. కష్టపడి చదివితే సాధ్యం కానిది లేదంటూ నిరూపించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన సంతోష్ మూడు నెలల వ్యవధిలో వచ్చిన ఫలితాల్లో నాలుగు బ్యాంకు ఉద్యోగాలు సాధించి నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలిచారు.
☛ Success Story: పరీక్ష రాస్తే.. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగమే..
☛ Success Story: వీటిపై పట్టు సాధించా.. బ్యాంక్ జాబ్ కొట్టా..