Skip to main content

Success Story: వీటిపై ప‌ట్టు సాధించా.. బ్యాంక్‌ జాబ్ కొట్టా..

‘బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ.. బ్యాంకింగ్.. రెండూ పూర్తిగా భిన్న నేపథ్యాలు.. అదే సమయంలో రెండింటిలోనూ కెరీర్ పరంగా మంచి అవకాశాలు.. కానీ బ్యాంకు జాబ్‌తో సుస్థిర కెరీర్ సొంతం చేసుకోవచ్చు..
హేమలత, ప్రొబేషనరీ ఆఫీసర్‌
హేమలత, ప్రొబేషనరీ ఆఫీసర్‌

అందుకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ (ఐబీపీఎస్) నిర్వహించే ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ-3 పోస్టును లక్ష్యంగా నిర్దేశించుకుని విజయం సాధించాను’ అంటున్నారు.. హేమలత. కెనరా బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎంపికైన హేమలత సక్సెస్ స్టోరీ మీకోసం..

బ్యాంకింగ్ ఆన్‌లైన్ ప‌రీక్ష‌ల కోసం క్లిక్ చేయండి

ప్ర‌తి రోజు ఇలా చ‌దివా..
బీఫార్మసీ.. బ్యాంకు రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్.. ఈ రెండూ పూర్తిగా భిన్నం. బీఫార్మసీ సిలబస్ ఐబీపీఎస్ పరీక్షకు ఏ మాత్రం ఉపయోగపడదు. అయినప్పటికీ.. లక్ష్యాన్ని సాధించాలనే తపనతో పకడ్బందీ ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాను. ప్రధానంగా రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాను. రోజుకు పది గంటల చొప్పున ప్రిపరేషన్‌కు కేటాయించాను. ఆయా సబ్జెక్టుల్లో అవగాహన స్థాయి ఆధారంగా ప్రతి సబ్జెక్ట్‌కు సమయాన్ని విభజించుకుని ప్రిపరేషన్ సాగించాను.

Bank Jobs: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, న్యూఢిల్లీలో 145 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..

విజ‌యంలో ఇవే కీల‌కం : 
ఐబీపీఎస్ పరీక్షలో విజయానికి ప్రధాన సాధనాలు.. వేగం, కచ్చితత్వం. నిర్దిష్ట సమయంలో ఆయా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా టైం మేనేజ్‌మెంట్ పాటించాలి. అదే సమయంలో సమాధానాల్లో కచ్చితత్వానికి ప్రాధాన్యం ఉండాలి. ఈ రెండూ కూడా ప్రాక్టీస్‌తోనే సాధ్యమవుతాయి. అందుకే సిలబస్‌లోని అంశాలపై పట్టు సాధిస్తూనే.. ఎప్పటికప్పుడు చదివిన అంశాలకు సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేసేందుకు ప్రత్యేక సమయం కేటాయించాను. ఐబీపీఎస్ పీఓ రాత పరీక్ష ప్రిపరేషన్ క్రమంలో సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌, సాక్షి భవితలో ప్రచురితమైన గెడైన్స్ ఆర్టికల్స్ అదనపు ప్రయోజనం చేకూర్చాయి. జనరల్ అవేర్‌నెస్‌తోపాటు, ఆయా సబ్జెక్ట్‌లు, సెక్షన్ల వారీగా నిరంతరం అందించిన గెడైన్స్ ఆర్టికల్స్‌ను క్రమం తప్పకుండా అనుసరించాను. ముఖ్యంగా జనరల్ అవేర్‌నెస్, డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు సంబంధించి భవితలో అందించిన జనరల్ ఎస్సేలు ఎంతో ఉపయోగపడ్డాయి.

Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..

పాక్టీస్ టెస్ట్‌లు.. మాక్ టెస్ట్‌లతో ఎంతో మేలు..
ఐబీపీఎస్ పరీక్షలో విజయ సాధనకు మరో రెండు కీలకమైన అంశాలు. అవి వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయడం, ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లకు హాజరవడం. ఈ రెండింటి ఫలితాలను విశ్లేషించుకోవడం వల్ల బలాలు, బలహీనతలు తెలుస్తాయి. తద్వారా ఇంకా దృష్టి సారించాల్సిన అంశాలపైన స్పష్టత వస్తుంది. దాంతో అందుబాటులో ఉన్న సమయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో అవగతమవుతుంది.

నా ఇంటర్వ్యూ ప్ర‌శ్న‌లు ఇవే..
నలుగురు సభ్యుల బోర్డు 15 నిమిషాలపాటు ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో ప్రధానంగా కుటుంబం, అకడెమిక్ నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. అంతేకాకుండా నిత్యజీవితంలో బ్యాంకింగ్ రంగం పాత్ర, ఆధార్ కార్డులను బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేయడం వల్ల ఉపయోగాలపై కూడా ప్రశ్నలు అడిగారు.

బ్యాంకింగ్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు- స‌మాధానాలు

బేసిక్స్‌పై ప‌ట్టు.. కొలువు కొట్టు..
బ్యాంకు పరీక్షల ఔత్సాహికులు.. ముందుగా పరీక్ష అంటే బెరుకుదనం పోగొట్టుకోవాలి. పరీక్షలో నిర్దేశిత సెక్షన్లలో అడిగే ప్రశ్నలన్నీ పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి ఆ స్థాయి సిలబస్‌పై పరిపూర్ణత సాధించాలి. అయితే ప్రశ్నలు అడిగే విధానంలో క్లిష్టత క్రమేణా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగిస్తే సత్ఫలితాలు ఆశించొచ్చు. కంప్యూటర్ అవేర్‌నెస్ కోసం కిరణ్ ప్రకాశన్ పుస్తకాలు సరిపోతాయి. జనరల్ అవేర్‌నెస్ కోసం ఇంగ్లిష్, తెలుగు న్యూస్ పేపర్లను కచ్చితంగా చదవాలి. ఇక పరీక్షలో ప్రతి సెక్షన్‌ను 20 నిమిషాల్లో పూర్తి చేసే విధంగా సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మరో విషయం.. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాస్తేనే ఫలితం ఉంటుందనే ఆలోచన వదిలేయాలి. కచ్చితమైన సమాధానాలతో 60 నుంచి 70 శాతం ప్రశ్నలు పూర్తి చేసినా.. ఇంటర్వ్యూ కాల్ ఆశించొచ్చు.

IBPS Jobs: త్వరలో క్లర్క్, ఎస్‌వో పోస్టులకు పరీక్షలు.. సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్ వివ‌రాలు ఇలా..

నా ప్రొఫైల్ : 
☛ పదో తరగతి: 81 శాతంతో ఉత్తీర్ణత (2007)
☛ ఇంటర్మీడియెట్: 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత (2009)
☛ బీఫార్మసీ: 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత (ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో)
☛ ఐబీపీఎస్ పీఓ/ఎంటీ-3 ఉమ్మడి ప్రవేశ పరీక్ష స్కోరు: 73

Published date : 23 May 2022 04:02PM

Photo Stories