Bank Employee Inspire Success Story : ఎలాంటి కోచింగ్ లేకుండానే.. ఒకేసారి నాలుగు బ్యాంకు ఉద్యోగాలు కొట్టానిలా.. కూలీ పనులు చేస్తూనే..
ఈ కుర్రాడే.. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన మనీష్ చౌహాన్. ఒకేసారి నాలుగు బ్యాంక్ ఉద్యోగాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో మనీష్ చౌహాన్ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
మనీష్ తండ్రి సురేష్ చౌహాన్. ఇతను బుర్హాన్‌పూర్‌లోని పవర్‌లూమ్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తల్లి పొలం పనులకు వెళ్లే దినసరి కూలీ. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదురైనా, కొడుకును మాత్రం వీరు ఉన్నత చదువులు చదివించారు. కూలి పని చేసుకునే తల్లిదండ్రులు అతన్ని ఎంతగానో ప్రోత్సహించారు.
ఎడ్యుకేషన్ :
మనీష్.. సేవా సదన్ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివాడు. బీఈడీ కూడా పూర్తి చేశాడు.
కోచింగ్‌కు డబ్బులు లేక..
మనీష్ కోరిక.. జీవితంలో బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలన్నది. తన లక్ష్యంను నెరవేర్చుకోవడానికి బ్యాంక్ పరీక్షలకు ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. కనీసం కుటుంబం గడవడం కష్టంగా ఉండటంతో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ప్రిపరేషన్ కోసం యూట్యూబ్ పాఠాలు ఫాలో అయ్యాడు. బ్యాంక్ పరీక్షల్లో మొదటి రెండు ప్రయత్నాల్లో ఫెయిల్ అయ్యాడు. ఇది ఇతనికి చలా నిరాశ కలిగించింది. మరింత కసి చదివి.. ఎలాగైనా బ్యాంక్ ఉద్యోగం సాధించాలనే పట్టుదల పెరిగింది. బ్యాంక్ ఉద్యోగాల ప్రిపరేషన్‌పై మరింత దృష్టి సారించాడు. రోజులో ఎక్కువ సమయం ప్రిపరేషన్‌కే కేటాయించేవాడు.
ఎట్టకేలకు.. మూడో ప్రయత్నంలో..
పట్టుదలతో మూడోసారి బ్యాంక్ ఎగ్జామ్స్‌కు ప్రయత్నించిన మనీష్.. ఈసారి సక్సెస్ అయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బ్యాంకుల్లో ఉద్యోగం సాధించి.. తన సత్తాచాటాడు. మధ్యప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ కావాలనే అతని కల ఎట్టకేలకు నెరవేరింది.
ఒకేసారి నాలుగు బ్యాంకు ఉద్యోగం కొట్టడంతో..
మనీష్ చౌహాన్ ఒకేసారి నాలుగు బ్యాంక్ ఉద్యోగాలను సాధించిన ఈ విషయం అందరికీ తెలిసింది. సమాజంలో అతనితో పాటు వారి కుటుంబానికి గుర్తింపు లభించింది. మనీష్ బంధువులు, స్నేహితుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాల కోసం యువత మధ్య పోటీ తీవ్రంగా మారింది. ఏటేటా నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఒక ఉద్యోగం సాధించడం చాలా కష్టమవుతుంది. కానీ మనీష్ చౌహాన్ ఒకేసారి నాలుగు బ్యాంకుల్లో కొలువు సాధించడం నిజంగా నేటి యువతకు స్ఫూర్తి అనడంలో సందేహం లేదు.
వీరికి ఎంతో రుణపడి ఉన్నా..
ఈ స్థాయికి రావడానికి తన తల్లిదండ్రులే కారణమని మనీష్ చెప్పాడు. వారికి ఎంతో రుణపడి ఉన్నానన్నాడు. ఈ విజయంలో తన తల్లిదండ్రుల పాత్ర మరువలేనిదన్నాడు. కొడుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడంతో అతని తండ్రి కల కూడా నెరవేరింది. చిన్నప్పటి నుంచి తన కుటుంబం పడుతున్న కష్టాలను చూసి పెరిగిన మనీష్.. ఇప్పుడు ఆర్థికంగా అండగా నిలిచే స్థాయికి ఎదిగాడు.
Tags
- Manish Chauhan Got Four Bank Jobs At Once
- Manish Chauhan Govt jobs in 4 banks at once
- Manish Chauhan bank jobs 2024
- Labourer Son In Madhya Pradesh Got Four Bank Jobs At Once
- Labourer Son In Madhya Pradesh Got Four Bank Jobs At Once News in Telugu
- Manish Chauhan four bank jobs success story in telugu
- bank employee success story in telugu
- Manish Chauhan for bank jobs success story in telugu
- Competitive Exams Success Stories
- bank employees success story in telugu
- bank employee inspirational stories in telugu
- Success Stories
- Inspire
- motivational story in telugu
- Government Jobs
- bank jobs
- bank jobs success story in telugu
- bank jobs success stories in telugu
- inspirational success story in telugu
- Multiple government job offers
- sakshieducationsuccess story