Tips and tricks for Interview: ఈ టిప్స్ ఫాలో అయితే... ఇంటర్వ్యూలో విజయం మీదే..!
ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకు అభ్యర్థులు ఎలా సన్నద్ధమవ్వాలి, ఎలా నడుచుకోవాలి.. ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి.. అన్న అంశాలను ఏపీపీఎస్సీ గ్రూప్-1 టాప్ ర్యాంకర్ డాక్టర్ రాణి సుశ్మిత వివరించారు.
1. ఉద్యోగం సాధించాలంటే ఇంటర్వ్యూలో తప్పక విజయం సాధించాలి. ఇంటర్వ్యూని ఫేస్ చేయలేక చాలామంది నిరుత్సాహంతో విజయానికి అడుగుదూరంలో నిలిచిపోతుంటారు. ఇలాంటి సమయంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అపరిచిత వ్యక్తులతో మాట్లాడడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. బ్యాంకులు, పాఠశాలలు, ఆసుపత్రులు... మొదలైన వాటికి వెళ్లి అక్కడి వారితో మాట్లాడటానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న కొత్త వాతావరణం మీ ఆత్మవిశ్వాస స్థాయిని పెంచుతుంది.
TSPSC News Exam Dates 2023 : టీఎస్‌పీఎస్సీ వివిధ పరీక్షల కొత్త తేదీ ఇవే.. అలాగే గ్రూప్-2 & 3 పరీక్షలు కూడా..
2. ఇంటర్వ్యూలో ప్రశాంతంగా ఉండాలి. మీ స్నేహితులతో మాట్లడానికి ప్రయత్నించండి. వివిధ అంశాలపై వారిని ప్రశ్నలు అడగమని కోరండి. వారి ప్రశ్నలకు మీరు కూల్‌గా సమాధానం చెప్పండి. ఒకవేళ ఆ ప్రశ్నకు మీకు సమాధానం తెలియనిపక్షంలో అంతే కూల్‌గా తెలియదని చెప్పండి.
3. సమాధానాలు ఎలా ఇచ్చామన్నది కూడా ముఖ్యమైన అంశం. తరచూ మాట్లాడుకునే సమయంలో హ్మ్, హా లాంటి ఊతపదాలను వాడుతుంటాం. ఇలాంటి వాటిని పూర్తిగా విస్మరించండి. ప్రతీ రోజు అద్దం ముందు ఒక 30 నిమిషాలు మీలో మీరే మాట్లాడుకోవడం ప్రాక్టీస్ చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులను అధిగమించవచ్చు.
4. మీరు మాట్లాడే ప్రతీ పదం స్పష్టతతో ఉండాలి. ప్రసంగంమధ్యలో అనవసర పదాలను త్యుజించడం మంచింది. ప్రతీ రోజు ఒక నిమిషం పాటు కంటిన్యూగా తప్పులు మాట్లాడకుండా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి.
PM YASASVI: పేద విద్యార్థులకు వరం... ఏడాదికి లక్షరూపాయలకు పైగా ఉపకారవేతనం.. ఇలా దరఖాస్తు చేసుకోండి
5. రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న వర్తమాన అంశాలపై అవగాహనతో ఉండాలి. ఇంటర్వ్యూ ఉన్న రోజు కూడా కరెంట్ అఫైర్స్ ఫాలో కావాలి.
6. ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు మంచి దుస్తులు ధరించడం ఉత్తమం. ఫార్మల్ డ్రస్‌లైతే ఇంకా మంచింది. మీరు వేసుకోబోయే దుస్తులను ఒకటికి రెండు సార్లు ధరించండి. అప్పుడు మీకు కంఫర్టబుల్‌గా ఉంటుంది.
7. ఒత్తిడిని అధిగమించేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి. సాధ్యమైనంత ఎక్కువగా మాక్ ఇంటర్వ్యూలను ఫేస్ చేయడం ఉత్తమం.
Zomato delivery boy: ఉదయమంతా ఫుడ్ డెలివరీ చేసేవాణ్ని... రాత్రి పూట చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించానిలా...
8. ఇంటర్వ్యూ అనేది కేవలం పర్సనాలిటీ టెస్ట్ మాత్రమే అన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి. ఇక్కడ మీ నాలెడ్జ్‌కు పదునుపెట్టే ప్రశ్నలేమీ ఎదురుకావు. ఒక ప్యానెల్‌లో ఎదురయ్యే ప్రశ్నలకు మీరు ఎలా సమాధానం చెబుతున్నారన్న విషయాన్ని ప్యానల్ సభ్యులు గమనిస్తారు. మీరు సమాధానాలు ఇచ్చేదాన్ని బట్టి ప్యానల్ సభ్యులు మీపై అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు.
9. ఆకర్షణీయంగా ఉండేలా డీటేల్డ్ అప్లికేషన్ ఫాంను నింపండి. ఇక్కడ మీరు రాసిన సమాధానాలను బట్టి కూడా ప్యానల్ సభ్యులు అడిగే ప్రశ్నల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.
10. చివరగా మీ ఇంటర్వ్యూకు ఒక రోజు ముందు మిమ్మల్ని మీరు విజేతగా ఊహించుకోండి. పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగండి. ప్రతికూల వార్తలు, కామెంట్ల జోలికి పోవద్దు. బాగా నిద్రపోండి. ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి గంట ముందుగా చేరుకోండి. అక్కడ అవసరమైన దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
- విష్ యూ ఆల్ ద బెస్ట్