Skip to main content

APPSC Group-1 Exam 2024: గ్రూప్‌-1 పరీక్షలు, షెడ్యూల్‌ ఇదే

Group-1 exam paper 2 schedule  Staff preparing for Group-1 exam paper 2   Group-1 exam paper 1 schedule  APPSC Group-1 Exam 2024    Collector Lakshmisha directing staff for APPSC Group-1 exams
APPSC Group-1 Exam 2024

తిరుపతి అర్బన్‌: ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ లక్ష్మీశ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వాహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉండాలని స్పష్టం చేశారు.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌ –1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్‌ –2 పరీక్షలు జరుగుతాయన్నారు. పేపర్‌ –1 పరీక్ష ఉదయం 9 నుంచి 9.45 గంటల వరకు, పేపర్‌ –2 పరీక్షకు మధ్యాహ్నం 1 నుంచి 1.45 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

తిరుపతి నగరం, రూరల్‌ పరిధిలో మొత్తం 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 9,377 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్టు తెలిపారు. 16 మంది లైజన్‌ ఆఫీసర్‌ లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 9000665565, 9676928804లో సంప్రదించాలని ఆయన సూచించారు. ఆయన వెంట డీఆర్వో పెంచలకిషోర్‌, తిరుపతి ఆర్డీఓ నిశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Published date : 16 Mar 2024 11:30AM

Photo Stories