Skip to main content

APPSC Group 1 Mains 2018: గ్రూప్‌-1 మెయిన్స్ రద్దుపై APPSCకి హైకోర్టులో ఊరట

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు యధావిధిగా కొనసాగుతారని డివిజన్‌ బెంచ్‌ ఊరట ఇచ్చింది.  కాగా ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు చేస్తూ ఇటీవల సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
APPSC Group 1 Mains Cancelled APPSC Group 1 Mains Latest Update
APPSC Group 1 Mains Cancelled APPSC Group 1 Mains Latest Update

మెయిన్స్‌ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పేర్కొంది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన ఉన్నత న్యాయస్థానం గ్రూప్‌-1 మెయిన్స్‌పై సింగిల్‌ జడ్జి తీర్పును సస్సెండ్‌ చేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు కొనసాగుతారని తెలిపింది. తదుపరి విచారణను ఈనెల  27 కి వాయిదా వేసింది. 

ఇంతకీ ఏం జరిగింది?
2018 గ్రూప్ వన్ కింద 169 పోస్టులకి నోటిఫికేషన్‌ ఇచ్చింది ఏపీపీఎస్సీ. అయితే ఎంపికలో అవకతవకలు జరిగాయని,  మూడుసార్లు మూల్యాంకన జరిగిందని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. మరోవైపు.. హైకోర్టు ఆదేశాలతో డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి ఒకసారి మాత్రమే మాన్యువల్ గా మూల్యాంకన చేశామని వాదనలు వినిపించింది ఏపీపీఎస్సీ బోర్డు. ఇరువర్గాల వాదనలు విన్న సింగిల్‌ జడ్జి బెంచ్‌ మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.  

దీంతో.. ఆ నోటిఫికేషన్‌ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లలో ఆందోళన మొదలైంది. అయితే.. ఆందోళన అవసరం లేదని, అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడి తీరతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్‌ బెంచ్‌ ఎదుట సవాల్‌ చేసింది. తీర్పుపై స్టే విధించాలని కోరింది.  ఈ క్రమంలో.. మాన్యువల్‌గా ఒక్కసారే మూల్యాంకనం చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను డివిజన్‌ బెంచ్‌కు సమర్పించింది ఏపీపీఎస్సీ. 

వాటిని పరిశీలించిన డివిజన్‌ బెంచ్‌.. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది.  తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులకు కాస్త ఊరట లభించినట్లయ్యింది. 

Published date : 21 Mar 2024 02:53PM

Photo Stories