Skip to main content

Intermediate: అకడమిక్‌ క్యాలెండర్ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇలా..

రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు మే 30న విడుదల చేసింది.
Intermediate
అకడమిక్‌ క్యాలెండర్ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇలా..

మొత్తం 295 రోజులకు సంబంధించి 220 పనిదినాలు ఉండగా 75 రోజులు సెలవు దినాలుగా పేర్కొంది. 2023 ఏప్రిల్‌ 21వ తేదీతో విద్యాసంవత్సరం ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి మే 31వ తేదీ వరకు కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించాలని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు స్పష్టం చేశారు. అడ్మిషన్ల కోసం ప్రకటనలు ఇతర రకాల చర్యలతో విద్యార్థులను ఆకర్షించడం వంటి కార్యక్రమాలు చేయరాదని పేర్కొన్నారు.

చదవండి:

ఇంటర్‌ స్టడీ మెటీరియల్ | ఇంటర్‌ మోడల్ పేపర్స్ | ఇంటర్‌ ప్రివియస్‌ పేపర్స్

అకడమిక్‌ క్యాలెండర్‌ ఇలా..

కాలేజీల ఓపెనింగ్‌

జూలై 1

త్రైమాసిక పరీక్షలు

సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు

దసరా సెలవులు

అక్టోబర్‌ 2 నుంచి 9 వరకు

కాలేజీల రీఓపెన్‌

అక్టోబర్‌ 10

అర్ధసంవత్సర పరీక్షలు

నవంబర్‌ 14 నుంచి 19 వరకు

సంక్రాంతి సెలవులు

2023 జనవరి 11 నుంచి 17 వరకు

రీ ఓపెనింగ్‌

జనవరి 18

ప్రీఫైనల్‌ పరీక్షలు

జనవరి 19 నుంచి 25 వరకు

ప్రాక్టికల్‌ పరీక్షలు

ఫిబ్రవరి 8 నుంచి 28 వరకు

థియరీ పరీక్షలు

మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు

చివరి పనిదినం

ఏప్రిల్‌ 21

వేసవి సెలవులు

ఏప్రిల్‌ 22 నుంచి మే 31 వరకు

అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు

2023 మే చివరి వారంలో

Published date : 31 May 2022 11:49AM

Photo Stories