Intermediate Exams 2024:ఇంటర్ పరీక్షలు ప్రశాంతం ....455 మంది గైర్హాజరయ్యారు.
Sakshi Education
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం ....455 మంది గైర్హాజరయ్యారు.
అనంతపురం : జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్–2బీ, జువాలజీ–2, హిస్టరీ–2 పరీక్షలు జరిగాయి. మొత్తం 455 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 14,298 మందికి గాను 13,895 మంది హాజరయ్యారు. 402 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,245 మందికి గాను 1,192 మంది హాజరయ్యారు. 53 మంది గైర్హాజరయ్యారు. అనంతపురం కొత్తూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కేంద్రంలో ఒక విద్యార్థి కాపీ కొడుతూ బుక్ కావడంతో డిబార్ అయ్యాడు. ఇంటర్ పరీక్షల జిల్లా కన్వీనర్ ఎం. వెంకటరమణనాయక్ 5 కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 11 కేంద్రాలు పరిశీలించాయి. 4 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.
Published date : 12 Mar 2024 01:33PM