Skip to main content

Intermediate: మూడో విడత అడ్మిషన్లు ప్రక్రియ ప్రారంభం.. చివరీ తేదీ ఇదే..

Intermediate
మూడో విడత అడ్మిషన్లు ప్రక్రియ ప్రారంభం.. చివరీ తేదీ ఇదే..

ఇంటర్‌ కాలేజీల్లో ప్రథమ సంవత్సరం మూడో విడత, చివరి విడత ప్రవేశాల ప్రక్రియ సెప్టెంబర్‌ 2 నుంచి ప్రారంభమవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. సెప్టెబర్‌ 10 వరకు ప్రవేశాల ప్రక్రియను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. 

చదవండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం

పదో తరగతి.. ప్రతి విద్యార్థి జీవితంలో.. కీలకమైన దశ! భవిష్యత్తును దిశానిర్దేశం చేసే దశ! పదో తరగతి తర్వాత.. అకడమిక్‌గా వేసే అడుగులే.. విద్యార్థి కెరీర్‌ అవకాశాలను, భవిష్యత్తునూ నిర్ణయిస్తాయి! ఇంతటి కీలకమైన.. పదోతరగతి దశ దాటిన విద్యార్థులు.. తమకు సరితూగే కోర్సు ఏది? అని ఆరా తీస్తున్నారు! ఏ కోర్సులో అడుగుపెడితే.. భవిష్యత్తు అవకాశాలు బాగుంటాయనే అన్వేషణ సాగిస్తున్నారు! తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్నారు. ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో.. పదోతరగతి తర్వాత అందుబాటులో ఉన్న అకడమిక్‌ మార్గాలు.. భవిష్యత్తు అవకాశాలు.. ఆయా కోర్సులను ఎంచుకోవడానికి ఉండాల్సిన లక్షణాలు తదితర అంశాలపై విశ్లేషణ..

పదో తరగతి తర్వాత.. అనేక ఉన్నత విద్య మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో తాను ఎటువైపు అడుగులు వేయాలి.. ఏ కోర్సును ఎంచుకుంటే.. భవిత బంగారమవుతుంది.. ఎంచుకునే కోర్సు మన ఆసక్తికి, లక్ష్యాలకు తగినదేనా? ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో తలెత్తున్న సందేహాలివి!! 

చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!

ఇంటర్మీడియెట్‌

పదో తరగతి పూర్తయిన విద్యార్థుల ప్రథమ గమ్యంగా నిలుస్తున్న కోర్సు.. ఇంటర్మీడియెట్‌. ఈ కోర్సులో విభిన్న గ్రూప్‌లు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్‌.. ఇలా.. అనేక గ్రూప్‌లు! గ్రూప్‌ ఎంపిక కెరీర్‌ పరంగా కీలకంగా మారుతుంది. ఆయా గ్రూప్‌లతో లభించే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై పూర్తి అవగాహనతో విద్యార్థులు సరైన గ్రూప్‌ను ఎంచుకోవాలి. 

చదవండి: Government Jobs: పది, ఇంటర్ అర్హ‌తతోనే సర్కారీ కొలువులెన్నో..!

ఎంపీసీ–ఎక్కువ మంది ఎంపిక 

  • పదో తరగతి ఉత్తీర్ణుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్న గ్రూప్‌.. ఎంపీసీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ). కారణం.. ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించే ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు ఈ గ్రూప్‌ అర్హతగా ఉండటమే! ఎంపీసీ గ్రూప్‌.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల కలయికగా ఉంటుంది. ఎంపీసీలో చేరాలనుకునే విద్యార్థులకు సహజంగా కొన్ని లక్షణాలు ఉండాలి అంటున్నారు నిపుణులు. అవి.. కంప్యుటేషనల్‌ స్కిల్స్, న్యూమరికల్‌ స్కిల్స్‌. మన కళ్ల ముందు కనిపించే పరికరాలు, వాటి పనితీరు తెలుసుకునే ఆసక్తి, అకడమిక్‌గా ప్రయోగాల పట్ల ఇష్టమున్న వారు ఎంపీసీ గ్రూప్‌నకు సరితూగుతారు. 
  • ఎంపీసీ గ్రూప్‌తో ఎంసెట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ తదితర ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. ఐఐటీలు, నిట్‌లు తదితర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరడం ద్వారా ఉజ్వల కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్‌డీఏ, 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం వంటి పరీక్షల ద్వారా డిఫెన్స్‌ రంగంలో కెరీర్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు. భవిష్యత్తులో సైన్స్‌ రంగంలో స్థిరపడాలనుకుంటే.. ఇంటర్‌ ఎంపీసీతో బీఎస్సీ, ఆ తర్వాత ఎమ్మెస్సీ, రీసెర్చ్‌ కోర్సులు చేస్తే.. అవకాశాలు పుష్కలం. 

చదవండి: After 10th Class : `పది` తర్వాత ఉన్నత విద్యావకాశాలకు స‌రైన దారి...

బైపీసీ –మెడికల్‌తోపాటు మరెన్నో

  • ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సులను లక్ష్యంగా నిర్ణయించుకున్న విద్యార్థులకు ప్రధాన వేదిక ఇంటర్‌ బైపీసీ(బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ). ఈ కోర్సును ఎంపిక చేసుకునే ముందు వ్యక్తిగతంగా కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అవి.. లైఫ్‌ సైన్సెస్‌పై సహజ ఆసక్తి, పర్యావరణ స్పృహ వంటివి. సహనం, ఓర్పు అనేవి బైపీసీ విద్యార్థులకు ఉండాల్సిన ఇతర ముఖ్య లక్షణాలు.
  • జాతీయ స్థాయిలో నిర్వహించే మెడికల్‌ ఎంట్రెన్స్‌ నీట్‌లో ర్యాంకు ద్వారా.. ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. మెడికల్‌ కోర్సులతోపాటు వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ సైన్స్, ఆయుష్, ఫార్మసీ వంటి కోర్సుల్లోనూ చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత దశలో పీజీ, పీహెచ్‌డీ చేయొచ్చు. లైఫ్‌ సైన్సెస్, బయలాజికల్‌ సైన్సెస్‌లో కెరీర్‌ కోరుకునే అభ్యర్థులకు మార్గం.. బీఎస్సీ(బీజెడ్‌సీ). 

చదవండి: ఇంటర్‌తోనే...ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు

కామర్స్‌ కెరీర్స్‌కు సీఈసీ

  • భవిష్యత్తులో వ్యాపార, వాణిజ్య రంగాల్లో కెరీర్‌ కోరుకునే విద్యార్థులకు సరితూగే గ్రూప్‌.. సీఈసీ. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్‌ సబ్జెక్ట్‌ల కలయికగా ఉండే ఈ గ్రూప్‌ ద్వారా కార్పొరేట్‌ కొలువుల దిశగా అడుగులు వేయొచ్చు. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు ప్రధానంగా కాలిక్యులేషన్‌ స్కిల్స్, గణాంకాల విశ్లేషణ నైపుణ్యాలు, సూక్ష్మ స్థాయి పరిశీలన వంటివి ఉండాలి. 
  • సీఈసీ విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా బీకామ్‌ కోర్సు ప్రధాన మార్గంగా నిలుస్తోంది. బీకాం చదువుతూనే.. చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కామర్స్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసుకునే వీలుంది. ఈ కోర్సుల ఉత్తీర్ణులకు కంపెనీల్లో ఇంటర్నల్‌ ఆడిటర్స్, స్టాక్‌ ఆడిటర్స్, ఫైనాన్షియల్‌ మేనేజర్స్, అసిస్టెంట్‌ కంపెనీ సెక్రటరీస్‌ వంటి వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు సొంతమవడం ఖాయం.
  • బీకామ్‌ తర్వాత పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంకామ్‌ వంటి కోర్సుల్లో చేరొచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్, అకౌంటింగ్‌ రంగంలో రాణించాలనుకునే వారికి ఎంబీఏ ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌ ఉపయోగపడుతుంది. ఇందుకోసం బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా నిర్వహించే ఐసెట్‌లో ర్యాంకు సాధించాలి. ఐఐఎంలు, ఇతర ప్రముఖ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ కోసం క్యాట్, మ్యాట్, సీమ్యాట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో రాణించాల్సి ఉంటుంది.

చదవండి: ఇంటిగ్రేటెడ్ కోర్సులు

మెరుగైన గ్రూప్‌.. ఎంఈసీ

ఇంటర్మీడియెట్‌లో అందుబాటులో ఉన్న మరో గ్రూప్‌..ఎంఈసీ. ఇది మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్‌ సబ్జెక్ట్‌ల కలయికగా ఉంటుంది. ఈ గ్రూప్‌ను ఎంపిక చేసుకొని.. ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. ఇటు మ్యాథమెటిక్స్‌ అర్హతగా ప్రవేశం లభించే బీఎస్సీలో..అటు కామర్స్‌ అర్హతగా బీకాంలోనూ అడుగుపెట్టొచ్చు. ముఖ్యంగా వీరికి చార్టర్డ్‌ అకౌంటెన్సీ,కాస్ట్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సుల్లో రాణించే అవకాశం లభిస్తుంది. కంప్యుటేషనల్, కాలిక్యులేషనల్‌ స్కిల్స్‌తోపాటు ఏకాగ్రత, ఒక పనిపై సుదీర్ఘ సమయం వెచ్చించే ఓర్పు, సహనం ఉన్న విద్యార్థులు ఎంఈసీ గ్రూప్‌నకు సరితూగుతారు.

చదవండి: అవకాశాల్లో కింగ్.. ఔట్‌సోర్సింగ్

పోటీ పరీక్షలకు హెచ్‌ఈసీ

భవిష్యత్తులో సివిల్‌ సర్వీసెస్, గ్రూప్స్‌ తదితర ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకున్న విద్యార్థులకు అనుకూలించే గ్రూప్‌.. హెచ్‌ఈసీ. ఈ గ్రూప్‌లో ఉండే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్‌ సబ్జెక్ట్‌లపై పట్టు ద్వారా.. పలు ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం సాధించొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం. ఇటీవల కాలంలో హెచ్‌ఈసీ అర్హతగా ప్రవేశం లభించే బీఏ కోర్సులోనూ పలు జాబ్‌ ఓరియెంటెడ్‌ గ్రూప్‌ కాంబినేషన్స్‌(ఉదా: సోషల్‌ స్టడీస్, సోషల్‌ సైన్సెస్, ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ తదితర) అందుబాటులోకి వస్తున్నాయి. ఈ గ్రూప్‌ సబ్జెక్ట్‌లతో బీఏ పూర్తి చేయడం ద్వారా ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగావకాశాలు విస్తృతమవుతున్నాయి.

Published date : 02 Sep 2022 03:34PM

Photo Stories