Skip to main content

ఇంటిగ్రేటెడ్ కోర్సులు

డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే అవకాశాన్ని కల్పించడానికి ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఆవిర్భవించాయి. అందులోభాగంగా జాతీయ స్థాయి సంస్థలతోపాటు సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్ అర్హతతో వీటిలో చేరొచ్చు.

ఏ కోర్సులకు ఎవరు అర్హులు:
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ పూర్తిచేసినవారు ఇంజనీరింగ్, సైన్స్‌ల్లో డిగ్రీ, పీజీ చదవొచ్చు. లేదంటే.. ఇంటర్ అర్హతతో లా, మేనేజ్‌మెంట్, కామర్స్ వంటి కోర్సుల్లోనూ చేరొచ్చు. ఐదేళ్ల ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరి, మూడేళ్లకే మానేసే వారికి డిగ్రీ వస్తుంది. నాలుగేళ్లు చదివితే డిగ్రీ (ఆనర్స్) ఇస్తారు. ఐదేళ్లు పూర్తి చేస్తే ఐదేళ్ల పీజీ పట్టా చేతికొస్తుంది.

రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు- సంస్థలు...
ఆదికవి నన్నయ వర్సిటీ:
ఎంఎస్(బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, మైక్రోబయోలజీ, పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోరేషన్
వెబ్‌సైట్: www.nannayauniversity.info

ఉస్మానియా యూనివర్సిటీ: ఎంఏ (అప్లయిడ్ ఎకనమిక్స్); ఎంఎస్సీ (కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ); ఎంబీఏ
వెబ్‌సైట్: www.osmania.ac.in

ఆంధ్రాయూనివర్సిటీ: ఎంఎస్(జియాలజీ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, అప్లయిడ్ కెమిస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎకనామిక్స్)
వెబ్‌సైట్: www.andhrauniversity.info

ద్రవిడియన్ వర్సిటీ- కుప్పం: ఎంఏ (తెలుగు, ఇంగ్లీషు, హిస్టరీ), ఎంకాం (కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రట రీషిప్, కంప్యూటర్స్), ఎంఎస్సీ(కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్)
వెబ్‌సైట్: www.dravidianuniversity.ac.in

సెంట్రల్ యూనివర్సిటీ-హైదరాబాద్
ఎంఎస్సీ( మ్యాథమెటికల్ సెన్సైస్/ఫిజిక్స్/ కెమికల్‌సెన్సైస్/బయాలజీ, ఆప్టోమెట్రీ విజన్,నర్సింగ్ సెన్సైస్, హెల్త్‌సైకాలజీ),
ఎంఏ(హ్యుమానిటీస్, హిందీ, తెలుగు, ఉర్దూ, లాంగ్వేజ్ సెన్సైస్, సోషల్‌సెన్సైస్)
వెబ్‌సైట్: www.uohyd.ernet.in

నాగార్జున యూనివర్సిటీ: ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్
ఎంఎస్‌సీ నానోటెక్నాలజీ
వెబ్‌సైట్: www.anu.ac.in

కాకతీయ యూనివర్సిటీ: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ)
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి: ఎమ్మెస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ)
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం: ఎమ్మెస్సీ (బయోటెక్నాలజీ)
యోగి వేమన యూనివర్సిటీ: ఎమ్మెస్సీ (ఎర్త్ సైన్స్, బయోటెక్)
తెలంగాణ యూనివర్సిటీ: ఎం.ఎ. (ఎకనామిక్స్), ఎమ్మెస్సీ (ఫార్మా కెమిస్ట్రీ)
మహాత్మాగాంధీ యూనివర్సిటీ: ఎమ్మెస్సీ (ఫార్మా కెమిస్ట్రీ)
కృష్ణా యూనివర్సిటీ: ఎమ్మెస్సీ బయోటెక్ (మెరైన్/అగ్రి)
ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ: ఎంఏ-ఇంగ్లిష్
ఇంటిగ్రేటెడ్ ఎంఏ: హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, సైకాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ఈ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఒక్కో కోర్సులో మొత్తం 30 సీట్లున్నాయి.
వెబ్‌సైట్: www.cuk.ac.in

ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఒక్కో సబ్జెక్టుల్లో మొత్తం 40 చొప్పు న సీట్లున్నాయి.ఈ కోర్సులన్నింటినీ తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: www.tiruvarur.tn.nic.in

అలాగే జార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంగ్లిష్, మ్యాథ్స్, మాస్ కమ్యూనికేషన్, బిజి నెస్ అడ్మినిస్ట్రేషన్, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ, లైఫ్‌సెన్సైస్, కల్చరల్ స్టడీస్, నానో టెక్నాలజీ, వాటర్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ కోర్సులు ఆఫర్ చేస్తోంది. ఒక్కో సబ్జెక్టులో మొత్తం సీట్లు 40.
ఎంఏ ఇంగ్లిష్‌ను కర్ణాటక, కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.

ఎంబీఏలో కర్ణాటక, కాశ్మీర్, రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్‌ను బీహార్, రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.
ఎంఏ, ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం కింద డెవలప్‌మెంట్ స్టడీస్ సబ్జెక్టును బీహార్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది. అదేవిధంగా ఎంఎస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్ మెంటల్ సైన్స్ సబ్జెక్టులను ఆఫర్ చేస్తోంది.

కేరళ సెంట్రల్ యూనివర్సిటీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ ,యానిమల్ సైన్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో 16 సీట్లతో కోర్సులు ఆఫర్ చేస్తోంది.

జాతీయ స్థాయిలో...
  • బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంసీఏ కోర్సులను నిర్వహిస్తోంది.
  • తమిళనాడులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంబీఏలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు అందిస్తోంది.
  • పంజాబ్ వర్సిటీ ఇంటిగ్రేటెడ్ కోర్సు కింద బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సును అందిస్తోంది.
  • ఐఐఎస్‌ఈఆర్ వివిధ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్ కోర్సులు అందిస్తోంది.
  • నైసర్, భువనేశ్వర్ ఫిజిక్స్, బయాలజీ, కెమికల్ సైన్స్ కోర్సులు నిర్వహిస్తోంది.
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎమ్మెస్సీ-ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయలాజికల్ సెన్సైస్ కోర్సులు ఆఫర్‌చేస్తోంది.
  • ఐఐటీ రూర్కీ ఎమ్మెస్సీ-మ్యాథ్స్; ఐఐటీ ఖరగ్‌పూర్ ఎమ్మెస్సీ-మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్; ఐఐటీ కాన్పూర్ ఎమ్మెస్సీ-మ్యాథ్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ కోర్సులు అందిస్తున్నాయి.
Published date : 03 Jul 2012 02:20PM

Photo Stories