AP 10th Supplementary Exams Results: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల తేదీ ఇదే.. ఈ సారి మాత్రం..
జూలై 6 నుంచి 15 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే . ఈ ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు.
How to check AP SSC Advanced Supplementary Results 2022?
- Visit results.sakshieducation.com or sakshieducation com
- Click on AP SSC Supplementary results 2022 on the home page
- Enter your hall ticket number in the results page.
- Click on submit button
- The results will be displayed
- Download a copy for further use
రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగానే..
ఈ పరీక్షల్లో పాసయ్యే వారిని కంపార్ట్‌మెంటల్ అని కాకుండా రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించనుంది. వారికి రెగ్యులర్ విద్యార్థులకు మాదిరిగానే పరీక్షల్లో వచ్చిన మార్కుల ప్రకారం డివిజన్లను కేటాయించనుంది. ఈ మేరకు నిబంధనలు సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ గతంలో మెమో జారీ చేశారు. ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మాత్రమే ఈ సడలింపు వర్తించనుందని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్కూళ్లు సరిగా నడవకపోవడం, ముఖ్యంగా 8, 9 తరగతుల విద్యార్థులకు పాఠాల నిర్వహణ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వారు చాలా వెనుకపడ్డారు. దీంతో పదో తరగతి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది ఉత్తీర్ణులు కాలేకపోయిన విషయం తెల్సిందే.