Tenth Students Ability: పది పరీక్షల్లో వసతి గ్రుహాల విద్యార్థుల ప్రతిభ..
అనంతపురం రూరల్: ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని 79 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో 1,172 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా వీరిలో 964 మంది ఉత్తీర్ణత సాధించారు. 37 బీసీ వసతి గృహాల్లో 560 మందికి గాను 448 మంది ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.
Degree Semester Exams: ఎస్కేయూ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు.. ఎప్పటి వరకు?
వీరిలో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 33 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని 360 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 321 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 11 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 3 ఎస్టీ వసతి గృహాలు, 6 గురుకుల పాఠశాలల్లోని 252 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వీరిలో 195 మంది ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. అత్యధికంగా గుత్తి ఎస్సీ బాలుర వసతి గృహం–1 విద్యార్థి డి.ఆసీఫ్ 570 మార్కులు, రాయదుర్గంలోని బీసీ (బాలికల) హాస్టల్ విద్యార్థిని అభిల 560 మార్కులు, గొల్లలదొడ్డిలోని గిరిజన సంక్షేమశాఖ హాస్టల్ విద్యార్థి గురుచరణ్ నాయక్ 533 మార్కులు సాధించారు.