సింగిల్ టీచర్ స్కూల్స్ ఉండవు
Sakshi Education
రాష్ట్రంలో సింగిల్ టీచర్ స్కూల్స్ ఉండవని విద్యాశాఖ స్పష్టం చేసిందని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి చెప్పారు.
విజయవాడలో జూన్ 20న 117 నంబరు జీవో మీద Andhra Pradesh School Education Department జాక్టో ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన సమావేశంలో అధికారులు ఈ విషయం చెప్పారని తెలిపారు. 117 జీవోలోని రీ అపోర్షన్‌మెంట్, పదోన్నతులు, పీఎస్ హెచ్‌ఎం పోస్టు యథాతథంగా ఉంచడం, ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల పనిభారం, రెండు మీడియంల కొనసాగింపు తదితర అంశాలపై అభ్యంతరాలు తెలిపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ‘1:30 నిష్పత్తిలో మిగిలిన ఉపాధ్యాయులను ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు టీచర్లుండేలా, ఇంకా మిగిలిన వారిని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రోల్ ప్రకారం అవరోహణ క్రమంలో కేటాయిస్తాం. రాష్ట్రంలో ఎక్కడా సింగిల్ టీచర్ స్కూల్స్ ఉండవు..’ అని వివరించారని తెలిపారు.
చదవండి:
Published date : 21 Jun 2022 12:32PM