Skip to main content

Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాలల్లో ‘TECH’ పాఠాలు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు­లకు సాంకేతిక పరిజ్ఞానం చేరువ చేసేలా రాష్ట్ర ప్ర­భుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని పాఠశాల విద్యా­­శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలి­పారు.
Amaravati government's strategy for students   Bringing technology to government school students   Tech lessons in government schools    Amaravati's School Education Department focuses on tech for students

అందుకోసం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఇంటర్న్‌­షిప్‌తో పాటు స్టైఫండ్‌ అవకాశాన్ని ఉన్నత విద్యా­శాఖ సమన్వయంతో పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష చేపట్టిందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్‌’పై జ‌నవ‌రి 9న‌ ఆన్‌లైన్‌ ఓరియెంటేషన్‌ ప్రొగ్రాం విజయ­వాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభించారు. ఇందులో ప్రవీణ్‌ ప్రకాశ్‌తో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్, ఇన్‌ఫ్రా కమిషనర్‌ కాటమనేని భాస్కర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు ఇతర ఉన్నతా­దికారులు పాల్గొ­న్నారు.

చదవండి: Artificial Intelligence: కృత్రిమ మేధతో నవ ప్రపంచం?

ప్రవీణ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక విద్యాభివృద్ధి కార్య­క్రమాలలో ఇంజినీరింగ్‌ విద్యా­ర్థులు కూడా భాగం కావాలన్నారు. వీరు తమకు కేటాయించిన పాఠ­శాలల్లో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానళ్లు, విద్యార్థులకు ట్యాబ్‌ల వాడకంపై 3–4 నెలల పాటు మార్గనిర్దే­శనం చేస్తారన్నారు.

8, 9 తరగతుల విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లు ద్వారా నాణ్యమైన విద్యను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయాన్ని గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్టు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

చదవండి: INSPIRE MANAK: ఇన్‌స్పైర్‌ మనక్‌ ప్రదర్శనలు.. ఈ తేదీ లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయ‌లి

ఏఐ, డేటా మేనేజ్‌­మెంట్, మెషిన్‌ లెర్నింగ్, చాట్‌ జీపీటీ, వెబ్‌ 3.0, ఆగ్మెంటెడ్‌ రియా­లిటీ, వర్చువల్‌ రియాలిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి సాంకేతికత పరిజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమాన్ని జ‌నవ‌రి 22న ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే 8 క్రెడిట్‌లు అందిస్తామన్నారు.  

Published date : 10 Jan 2024 01:32PM

Photo Stories