Skip to main content

Artificial Intelligence: కృత్రిమ మేధతో నవ ప్రపంచం?

స్మార్ట్‌ ఫోన్ల రాకతోనే జనం వాస్తవ ప్రపంచానికి దూరమయ్యారని ఒక విమర్శ. అలాంటిది జనరేటివ్‌ ఏఐ మనదాకా వస్తే? అప్పుడు వర్చువల్‌ ప్రపంచంలో మరింత కూరుకుపోతామా? మన చాలా పనులను ఏఐ చేయడం మొదలుపెడితే, మన చేతికి బోలెడు సమయం చిక్కుతుంది. అప్పుడు మనం తోటలో తిరుగుతూనో, వ్యాయామం చేస్తూనో గడపవచ్చు. విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గిపోతుంది. పిల్లల శక్తిసామర్థ్యాలకు తగ్గట్టుగా రోబోలు చదువులు చెబుతాయి. కానీ ఎప్పుడో మొదలైన డిజిటల్‌ విప్లవ ఫలాలు ఇప్పటికీ అందరికీ చేరనేలేదు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీ కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనం కలిగించేదిగా మారుతుందా అన్నది ప్రశ్న!
new world with artificial intelligence    Generative AI   Virtual world  Artificial intelligence benefits

ఒక సగటు భారతీయుడు ఏడాదికి 2,300 గంటల సమయం స్మార్ట్‌ ఫోన్‌ మీద గడిపే స్తున్నాడని ఒక అంచనా. 580 గంటలు ఓటీటీ(ఓవర్‌ ద టాప్‌) ప్లాట్‌ ఫామ్‌లలో కంటెంట్‌ను వెతుక్కుని వాటిని చూసేందుకు ఉపయోగి స్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ దాదాపు ఇదే రకమైన ధోరణి కనిపి స్తోంది. సైబర్‌ మీడియా రీసెర్చ్‌ ద్వారా మేము జరిపిన అధ్యయనంలో ఈ పోకడలు వెల్లడయ్యాయి. కొన్నేళ్లుగా డిజిటల్‌ వినియోగ దారుల తీరుతెన్నులను పరిశీలించేందుకు మేము ఈ సర్వేల్లాంటివి చేస్తున్నాం. స్మార్ట్‌ ఫోన్లు, టెక్నాలజీలతో మన జీవితాలు ఎంతగా పెన వేసుకుపోయాయో సూచిస్తాయి ఈ సర్వే విశేషాలు.

చేతిలో కావాల్సినంత సమయం

2024 అంటే ఈ ఏడాది ఇప్పటివరకూ చెప్పుకున్న అంశాలన్నింటిలోనూ విప్లవాత్మక మార్పులు వస్తే? జరగబోయేది ఇదే. అంతా జనరేటివ్‌ ఏఐ పుణ్యం! 2023లో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌– ఏఐ), మరీ ముఖ్యంగా జనరేటివ్‌ ఏఐ అనేది ప్రపంచం మొత్తాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసింది. టెక్నాలజీ ధోరణులను నిత్యం పరిశీలించే విశ్లేషకుడిగా 2024లో ఈ ఏఐ విషయంలో ఏం జరగబోతోందన్నది నాకెంతో ఉత్సుకత రేకెత్తించే అంశం. అయితే ఒక్కటైతే నిజం. ఈ ఏడాది కృత్రిమ మేధ విస్తృత స్థాయికి చేరుతుందన్నది నా నమ్మకం. 

జనరేటివ్‌ ఏఐ అనేది మన చిన్న చిన్న పనులను ఇట్టే చేసేస్తుంది. టెక్ట్స్‌ జనరేట్‌ చేయడం, చిత్రాలు, మోడల్స్‌ను సిద్ధం చేయడం వంటి చాలా పనులను ఆటోమేట్‌ చేయనుంది. భవిష్యత్తులో ఏం జరుగు తుందన్నది ఒకసారి చూస్తే... ఏఐ, జనరేటివ్‌ ఏఐ నైపుణ్యాలు కలిగిన వారు మిగిలిన వారికంటే మెరుగైన స్థితిలో ఉంటారు. దీనివల్ల 2024 లోనే కాదు... ఆపై కూడా మన చేతుల్లో బోలెడంత సమయం మిగిలి పోనుంది. ఈ మార్పు పుణ్యమా అని ఉత్పాదకత పెరుగుతుంది. కాసేపు ప్రకృతి ఒడిలో సేద తీరడం మొదలుకొని మన ఫిట్‌నెస్‌ గోల్స్‌ను సాధించుకునేందుకు ప్రయత్నించడం, లేదా తోటపని చేసు కోగలగడం ఎంత గొప్ప అనుభూతిని ఇస్తుందో ఆలోచించండి. 

విద్యార్థుల నేస్తం

మనుషులు సర్వవ్యాప్తమైన ఏఐ, జనరేటివ్‌ ఏఐలతో కలిసి జీవించడం అలవాటు అవుతున్న తరుణంలో జనరేషన్  ఆల్ఫా పరిస్థితి ఏమిటి? 2010, అటుపై పుట్టినవాళ్లను జనరేషన్‌ ఆల్ఫా అంటున్నాం. వీరు కృత్రిమ మేధకు స్థానికుల కింద లెక్క. వీరికి ఏఐ అనేది మునుపటి తరానికి స్మార్ట్‌ ఫోన్ మాదిరిగా మారి ఉంటుంది. మనతో మాట్లాడగలిగే ఆటబొమ్మలు ఇప్పుడు బోలెడు అందుబాటులోకి వచ్చే శాయి. భావోద్వేగాలను పలికించగల, ఏఐ భాగస్వామి అని పిలు స్తున్న తెలివైన రోబోలు పిల్లలకు వారి శక్తిసామర్థ్యాలకు తగ్గట్టు చదువులు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. వారితోపాటు తాము ఎదిగేందుకు రోబోలు ప్రయత్నిస్తున్నాయి. 

చదవండి: IT Companies: పెరుగుతున్న నిపుణుల కొరత.. ఏఐతో ఇది మరింత వేగవంతం

పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు జనరేటివ్‌ ఏఐ ఓ కొత్త ప్రపంచాన్ని వారి కళ్లముందు ఆవిష్కరించనుంది. భవిష్యత్తులో పిల్లల భుజాలపై పుస్తకాల సంచి బరువు ఉండకపోవచ్చు. ఇంటరాక్టివ్‌ సిము లేషన్ ్స, అడాప్టివ్‌ టెక్ట్స్‌ బుక్స్, ఏఐ మెంటర్స్‌... విద్యార్థుల అవస రాలు, ఆశయాలకు అనుగుణంగా బోధించడం మొదలవుతుంది. ఇప్పటిమాదిరిగా బట్టీపట్టే విషయం గత చరిత్ర కానుంది. పిల్లలు గొలుసులన్నీ తెంచుకుని, పిచ్చి పోటీని వదిలించుకుని తమకు నచ్చిన అంశాన్ని చదవుకునే వీలు ఏర్పడుతుంది.

ప్రతి దశలోనూ కృత్రిమ మేధ వారికి తోడుగా నిలుస్తుంది. కృత్రిమ మేధ ప్రపంచంలో ఉపా ధ్యాయుల పాత్ర కూడా గణ నీయంగా మారనుంది. సృజనాత్మకత, ఇష్టాయిష్టాలకు అనుగుణంగా విద్యార్థులు చేసే ప్రయత్నాలకు సహాయం అందించే వారిగా వీళ్లు మారిపోతారు. ఇలాంటి వాతా వరణంలో పెరిగి పెద్దయిన పిల్లలు ఏఐ ఆధారిత టూల్స్, లాంగ్వేజ్‌ మోడళ్ల సాయంతో భాషా భేదాలను అధిగమిస్తారు.

అంతరాలు తగ్గేనా?

కృత్రిమ మేధ కచ్చితంగా ఓ అందమైన, సానుకూల భవి ష్యత్తును చూపుతున్నప్పటికీ దీనికి ఇంకో కోణమూ ఉంది. ఇప్పటికే ఉన్న డిజిటల్‌ అంతరం మరింత పెరుగుతుందా? ఫలితంగా ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీ ఫలాలు కేవలం కొందరికి మాత్రమే పరిమితమవుతాయా అన్నది ఇంకో ప్రశ్న. ఎప్పుడో దశాబ్దాల క్రితం మొదలైన డిజిటల్‌ విప్లవ ఫలాలు ఇప్పటికీ అందరికీ చేరనేలేదు. డిజిటల్‌ డివైడ్‌ అని పిలుస్తున్న ఈ అంతరమే పూర్తిగా పూడని నేపథ్యంలో కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీ కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనం కలిగించేదిగా మారితే ఎలా అన్నది అందోళన కలిగించే అంశం. 

ఇక మనుషుల మధ్య సంపర్కం ఇంతకుముందులానే ఉంటుందా? మానవ సంబంధాలు మునుపటి మాదిరిగానే కొనసాగుతాయా? ఈ నేపథ్యంలో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వాడుకోవడం చాలా అవసరమవుతుంది. ప్రైవసీ, వివక్ష, విశ్వసనీయత వంటి విషయాల్లోనూ ప్రశ్నలు మిగిలే ఉంటాయి. ఒక్కటైతే వాస్తవం. ప్రపంచగతిని మార్చేసే శక్తి ఏఐ సొంతం. సమర్థత అనేది అన్ని రంగాల్లోనూ పెరిగిపోయేందుకు ఇది కారణమవుతుంది. ఈ తరం పిల్లలు ఏఐ నేతృత్వంలోని ప్రపంచంలో ఎదుగుతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో మరింత సృజనాత్మకంగా మసలుకునేందుకు వీరికి అవకాశాలు ఎక్కువ.

వ్యాసకర్త సైబర్‌ మీడియా రీసెర్చ్‌(సీఎంఆర్‌)లో ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ విభాగాధిపతి (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

Published date : 10 Jan 2024 11:29AM

Photo Stories