All India Children’s Educational eContent Competitionలో మన రాష్ట్రానికి బహుమతులు
- సైట్ - ఎస్సీఈఆర్టీ సిబ్బందిని అభినందించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు
ఆలిండియా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఇ- కంటెంట్ 2022-23 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు ప్రథమ బహుమతులు దక్కాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి గారు ఓ ప్రకటనలో తెలిపారు. Central Institute of Educational Technology (CIET), NCERT న్యూదిల్లీ వారి ఆధ్వర్యంలో మార్చి27న అవార్డుల ప్రదానం జరిగింది.
చదవండి: Admissions in KVS: కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకత, విద్యాబోధన, ప్రవేశ విధానం.. ముఖ్య వివరాలు ఇవే..
ఆడియో, వీడియో విభాగాల నుండి ఏడు విద్యా కార్యక్రమాలు స్క్రీనింగుకు ఎంపికవ్వగా, వాటిలో ఆడియో కేటగిరిలో సైట్- ఎస్సీఈఆర్టీ ప్రొడక్షన్ రూపొందించిన 'రంగులకల', వీడియో కేటగిరిలో ఏపీ మోడల్ స్కూల్ (కుప్పిలి, శ్రీకాకుళం) టీజీటీ P. రామకృష్ణ ఆధ్వర్యంలో ఏడో తరగతి విద్యార్థి ఎన్.పవన్ రూపొందించిన 'డైవర్స్ మోషన్'కు మొదటి బహుమతులు దక్కాయి.
చదవండి: Twitter Logo: పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!
ఈ సందర్భంగా సైట్ ,ఎస్సీఈఆర్టీ సిబ్బందిని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ అభినందించారు.
ఫొటోలు:
- సైట్ - ఎస్సీఈఆర్టీ సిబ్బందిని అభినందించిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు
- వీడియో విభాగంలో ప్రథమ బహుమతి 'డైవర్స్ మోషన్'.
- ఆడియో విభాగంలో ప్రథమ బహుమతి పొందిన 'రంగులకల'