Department of Education: ఒక్క బడి మూత పడలేదు
ఏ పాఠశాల మూతపడిందో చూపించాలని ఆయన సవాలు విసిరారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలపై ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించిన నేపథ్యంలో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జూలై 7న ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
దేశవ్యాప్తంగా విద్యారంగంలో సంస్కరణలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. విద్యా హక్కు, కొత్త విద్యా విధానాన్ని బేరీజు వేసుకున్న అనంతరమే విద్యా వ్యవస్థను పటిష్టంచేసే దిశగా సంస్కరణలు తీసుకొచ్చాం. నిరుపేదలు కూడా బాగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య అందించాలని, పాఠశాల స్థాయి నుంచే ఉత్తమ విద్య అందించాలని సీఎం జగన్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎల్లో పత్రికలో రాసినట్లుగా రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేయడంలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వపరంగా, ఒక మంత్రిగా, అధికారికంగా చెబుతున్నా. 8 వేల స్కూళ్లు మాయం అని రాశారు.. అవి ఎక్కడ మాయమయ్యాయో చూపండి.. మాయం కావడానికి అవేమైనా తోపుడు, ఎడ్ల బండ్లా? ఏమిటా భాష? ఏమిటా రాతలు? ఎందుకంత అనైతికత? ఇక చదువుల్లో గందరగోళం అని రాశారు. ఏమిటా గందరగోళం? అసలు మీలోనే ఆ గందరగోళం? ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో ఎల్లో మీడియాకు దిక్కుతోచడంలేదు. బడులు మూస్తే తిరగబడాలని ఎల్లో మీడియాలో రాశారు. మరి బడులు మూయకపోతే మీ ఆఫీసులకు తాళాలు వేయాలా?
చదవండి: విద్యావ్యవస్థపై భారీ వ్యయం.. 9 రకాల కార్యక్రమాలు ఇవే..
కడుపుమంటతో దుష్ప్రచారం
పుస్తకాల్లేవు.. చదువులు లేవు.. అని రాశారు. అది పట్టుకుని చంద్రబాబు మాట్లాడారు. ఏమిటి వారి ఉద్దేశమంటే, ప్రజలను అయోమయానికి గురిచేయడం. అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా తప్పుపట్టిన ఏకైక వ్యక్తి చంద్రబాబు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్న అక్కసు. ఆ కడుపుమంటతో వారంతా కలిసి దుష్ప్రచారం చేస్తున్నారు. నూతన విద్యా విధానం ప్రకారం ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటుచేస్తున్నాం.. ఆ మేరకు అంగన్‌వాడీల్లో మార్పులు చేస్తున్నాం. 1 నుంచే విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని స్కూళ్లు 3 కి.మీ దూరంలో ఉన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాగానే, కిలోమీటర్ లోపలే ఉండాలని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు.. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడితే తప్పకుండా పునరాలోచించి మార్పులు చేస్తాం.
చదవండి: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బేస్‌లైన్ టెస్టు తేదీ ఇదే..
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కోసం జీఓ జారీచేశాం. టీచర్ల అభ్యంతరాలు విన్నాం. కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించాం. మా చర్యలలో 90% వాటికి వారు ఆమోదం తెలిపారు. ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ విధానమని చెప్పాం. ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేస్తాం. మెరుగైన విద్య కోసం మేం తీసుకుంటున్న చర్యల్లో చంద్రబాబు ఒక్కటైనా చేశాడా? వీటి గురించి అసలాయన ఎప్పుడైనా ఆలోచించాడా? నాడు–నేడు కింద స్కూళ్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అయినా వీరు పుస్తకాల్లేవని రాస్తున్నారు.. ఏం ఖర్మ వచ్చింది. విద్యా ప్రమాణాల పెంపులో వెనక్కి తగ్గం సీబీఎస్సీ సిలబస్‌తో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్‌ను పెట్టి, విద్యా ప్రమాణాలు పూర్తిగా మారుస్తున్నాం. ఇందులో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గం. ఇలాంటి రాతలను అందరూ ఛీకొట్టాలి.