సైన్స్‌పై ‘టెన్’షన్ వద్దు
పరీక్ష కేంద్రంలో విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా పరీక్ష రాసేలా అప్రమత్తమైంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఏప్రిల్ 13న సైన్స్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో ప్రశ్నపత్రం 100 మార్కులకు భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రంకు ఒకటే పేపర్ ఉండటం తెలిసిందే. అయితే సమాధాన పత్రాలు మాత్రం 12 పేజీలతో కూడిన బుక్‌లెట్స్ రెండింటిని విద్యార్థులకు అందించనున్నారు. విద్యార్థులు కంగారు పడకుండా సమాధానాలను రాయాల్సి ఉంది. ప్రస్తుతం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. కృష్ణాజిల్లాలో 143 పరీక్ష కేంద్రాల్లో 19,935 మంది రెగ్యులర్, సప్లిమెంటరీ విద్యార్థులు 2,501 మంది విద్యార్థులు, ఎన్టీఆర్ జిల్లాలోని 154 పరీక్ష కేంద్రాల్లో 27,329 మంది రెగ్యులర్, 2,808 మంది సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది.
ప్రశ్నపత్రం ఒకటే..
ఈ దఫా జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం ఒకే ప్రశ్నపత్రంగా రూపొందించారు. 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. అయితే ఆయా ప్రశ్నలకు సమాధానాలను రాసేందుకు మాత్రం 12 పేజీలతో కూడిన బుక్‌లెట్‌లను రెండింటిని విద్యార్థులకు అందిస్తారు. 33 ప్రశ్నలు ఉండే ఈ ప్రశ్నపత్రంలో 1 నుంచి 16 వరకూ సైన్సు పి–1 (భౌతికశాస్త్రం), 17 నుంచి 33 వరకూ సైన్సు పి–2 (జీవశాస్త్రం)గా ప్రశ్నలు ఉండనున్నాయి. 1నుంచి 16వరకూ ఉన్న ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్‌తో ఉన్న పార్ట్–ఏ ఫిజికల్ సైన్సు బుక్‌లెట్‌లోనూ, 17 నుంచి 33 వరకూ ఉన్న ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్‌తో ఉన్న పార్ట్–బి బయోలాజికల్ సైన్సు సమాధాన పత్రంలోనూ సమాధానాలను రాయాల్సి ఉంటుంది.
చదవండి:
Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్ విద్యార్థులకు మాక్‌టెస్టులు..
High Court: ఈ ఉద్యోగులు పరీక్ష ఎలా రాస్తారు?
TSPSC: పరీక్షపత్రాల లీకేజీ.. రంగంలోకి ఈడీ..
AP EAPCET 2023: ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఇసారి ఈ అడ్మిషన్లు ఇలా..
విద్యార్థులు ఇవి చేయాలి..
- బుక్‌లెట్‌లను ముందుగా పరిశీలించుకోవాలి. ఆయా ప్రశ్నలకు సమాధానాలను నిర్దేశించిన బుక్‌లెట్‌లోనే రాయాలి.
- పరీక్ష హాలులోకి వెళ్లగానే ప్రశ్నపత్రంతో తదుపరి రెండు బుక్‌లెట్‌లను ఒకేసారి ఇస్తారు.
- ప్రశ్నలకు సమాధానం రాసే ముందు సమాధాన పత్రం (బుక్‌లెట్) ఏ పాఠ్యాంశానికి ఇచ్చిందో చూసుకుని సమాధానాలు రాయాలి.
- పరీక్షకు కేటాయించిన 3.15 గంటల సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని, అన్ని ప్రశ్నలకూ సమాధానాలను రాయటం మంచిది. తద్వారా మెరుగైన ఫలితం లభిస్తుంది.
- రేపు పదో తరగతి సైన్స్ పరీక్ష ఒకే ప్రశ్నపత్రంలో భౌతికశాస్త్రం, జీవ శాస్త్రం విద్యార్థులకు 12 పేజీలతో కూడిన రెండు బుక్‌లెట్స్ సమర్థమైన చర్యలు తీసుకున్న విద్యాశాఖ
ఆందోళన అధిగమించాలి..
ఏ పరీక్ష అయినా అభ్యర్థి ముఖ్యంగా ఆందోళనను అధిగమించాలి. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. సైన్స్ పరీక్ష విషయంలో 1–16 ప్రశ్నలకు సమాధానాలను పార్ట్–ఏలోనూ, 17–33 ప్రశ్నలకు పార్ట్–బిలోనూ సమాధానాలను రాయాలి. ఇన్విజిలేటర్లు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
– డి.దేవానందరెడ్డి, డైరెక్టర్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్
ఆందోళన వీడేలా చర్యలు..
సైన్సు పరీక్ష విషయంలో విద్యాశాఖ ముందు నుంచీ అప్రమత్తంగానే ఉంది. ప్రశ్నపత్రం, ఆ తదుపరి ఇచ్చే రెండు సమాధాన పత్రాలు (బుక్‌లెట్)లపై ఇప్పటికే విద్యార్థులకు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల ద్వారా అవగాహన కల్పించారు. దీంతో పాటుగా ఏప్రిల్ 10న గణితం పరీక్ష ముగిసింది. సైన్స్ పరీక్షలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాట్సాప్‌ల ద్వారా సూచనలను ప్రతి ఉపాధ్యాయుడు ద్వారా విద్యార్థులకు చేరవేయటం, పరీక్షకు సన్నద్ధమవ్వాల్సిన తీరుపైనా సూచనలు అందించారు.