Skip to main content

AP EAPCET 2023: ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఇసారి ఈ అడ్మిషన్లు ఇలా..

అనంతపురం: ఏపీ ఈఏపీసెట్‌–2023కు ఇప్పటిదాకా 2,80,779 దరఖాస్తులు వచ్చాయని సెట్‌ చెర్మన్‌ ప్రొఫెసర్‌ జింకా రంగ జనార్దన తెలిపారు.
AP EAPCET 2023
ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఇసారి ఈ అడ్మిషన్లు ఇలా..

ఇందులో 1,99,588 మంది ఇంజనీరింగ్‌కు, 80,462 మంది అగ్రికల్చర్‌– ఫార్మసీ విభాగానికి, రెండు విభాగాలకు కలిపి 729 మంది దరఖాస్తు చేశారని వెల్లడించారు. ఇంజనీరింగ్‌కు 84,064 మంది అమ్మాయిలు, 1,15,524 మంది అబ్బాయిలు దరఖాస్తు చేశారన్నారు. ఇక అగ్రికల్చర్‌– ఫార్మసీకి 57,561 మంది అమ్మాయిలు, 22,901 మంది అబ్బాయిలు దరఖాస్తు చేశారని వివరించారు. జేఎన్‌టీయూ అనంతపురంలో ఏప్రిల్‌ 11న రంగ జనార్దన సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సి.శోభాబిందుతో కలసి మాట్లాడారు.

చదవండి: AP Entrance Exams:మే 15న ఈఏపీసెట్‌.. ఈ ప‌రీక్ష క‌చ్చితంగా పాస్ అయిన వారికి మాత్ర‌మే... ఈసారి వెయిటేజీ ఎంతంటే

మే 15 నుంచి 18 వరకు ఇంజనీరింగ్, 22, 23 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ ప్రవేశపరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఏపీ ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్‌ 15 వరకు గడువు ఉందని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో ఏప్రల్‌ 30 వరకు, రూ.1,000 అపరాధ రుసుముతో మే 5 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 4 నుంచి 6 వరకు విద్యార్థుల డేటాలో మార్పులుచేర్పులకు అవకాశం కల్పిస్తామని వివరించారు. 

చదవండి: Engineering and Pharma: ‘బీ’ కేటగిరీ భర్తీ బాధ్యత వీరిదే

ఈఏపీసెట్‌ ద్వారానే బీఎస్సీ నర్సింగ్‌ అడ్మిషన్లు 

ఈ విద్యా సంవత్సరం నుంచి ఏపీ ఈఏపీసెట్‌ ఆధారంగానే బీఎస్సీ (నర్సింగ్‌)లో ప్రవేశాలు ఉంటాయని రంగజనార్దన తెలిపారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. కాగా సెట్‌కు ఇంటర్‌ సెకండియర్‌లో 100 శాతం, ఫస్టియర్‌లో 70శాతం సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు.

చదవండి: ఇంజనీరింగ్‌లో ఇన్ని సీట్లు.. 375 కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి

Published date : 12 Apr 2023 03:08PM

Photo Stories