Skip to main content

Andhra Pradesh: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. కీలక నిర్ణయాలు ఇవే

అమరావతి: విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు. సీఎం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ సత్ఫలితాలను ఇచ్చిందన్న అధికారులు.
Andhra Pradesh
విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. కీలక నిర్ణయాలు ఇవే

ప్రాథమిక విద్యలో నూటికి నూరుశాతం పిల్లలు బడిలోనే ఉన్నట్టుగా వెల్లడించిన అధికారులు. తాజా డ్రైవ్‌లో భాగంగా ప్రతి పిల్లాడూ బడిలో ఉండేలా చూసుకున్నామన్న అధికారులు. సీనియర్‌ సెకండరీ విభాగంలో 96.94 శాతం మంది బడిలో ఉన్నారని, హయ్యర్‌ సెకండరీ విభాగంలో 74.9శాతం బడిలో ఉన్నారని తెలిపిన అధికారులు. అమ్మ ఒడి, 10, 12 తరగతులు ఫెయిల్‌అయిన వారికి రీ అడ్మిషన్, స్కిల్‌ సెంటర్లలో చేర్పించి వారికి ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్, వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేసిన ప్రచారం వల్ల సత్ఫలితాలు వచ్చాయన్న అధికారులు. రాష్ట్రంలో మొత్తంగా 83,52,738 మంది 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుకున్న విద్యార్థులు ఉన్నట్టుగా తేలిందని వెల్లడి. 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ఇచ్చిన ట్యాబుల వినియోగంపై సీఎం సమీక్ష.

ఈ ఏడాది రెండో విడత ట్యాబులు ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం ఆదేశం. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటిల్‌అసిస్టెంట్లతో డివైజ్‌ వినియోగంపై బడిపిల్లలకు క్లాసులు ఇప్పించాలన్న సీఎం. తొలివిడతగా నిర్దేశించుకున్న మేరకు ఇప్పటికి 4,804 స్కూళ్లలో 30,213 ఐఎఫ్‌పీలు బిగించామని వెల్లడించిన అధికారులు. 6,515 పాఠశాలల్లో స్మార్ట్‌ టీవీల బిగింపు కూడా పూర్తయ్యిందన్న అధికారులు.

చదవండి: Police Jobs: దేహదారుఢ్య పరీక్షల్లో 342 మంది అర్హత

ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీల వినియోగింపై టీచర్లకు శిక్షణ ఇచ్చామన్న అధికారులు. మొదటి ఫేజ్‌లో నాడు – నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లకు డిసెంబర్‌ నాటికి ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు కావాలన్న సీఎం. ప్రతి పాఠశాలలో కూడా బ్రాడ్‌ బ్యాండ్‌ లేదా 4జి ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఇస్తున్నామన్న అధికారులు. ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఉన్నచోట రెండు రకాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయన్న అధికారులు.

వచ్చే డిసెంబరు కల్లా ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీలు ఉన్న పాఠశాలలకు పూర్తిగా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందాలన్న సీఎం. పాఠ్యప్రణాళికలోని పాఠ్యాంశాల కంటెంట్‌ వీరికి అందుబాటులో ఉంచాలన్న సీఎం. స్మార్ట్‌ ఫోన్‌లో, ఫోన్‌ ఎస్డీ కార్డులో, యూ ట్యూబ్‌లో, ట్యాబుల్లో, ఐఎఫ్‌పీలో, అధీకృత వెబ్‌సైట్లలో, ఇ–పాఠశాల డీటీహెచ్‌ల్లో ఇలా ఎందులోనైనా ఒకే పాఠ్యప్రణాళిక, ఒకే పాఠ్యాంశాలు ఉంచామని అధికారులు వెల్లడి. ఆగస్టులో నిర్వహించిన మొదటి అసెస్మెంట్‌ పరీక్షల్లో మూడో తరగతి నుంచి 9 వతరగతి వరకూ దాదాపు 91.33 శాతం మంది పిల్లలు ఇంగ్లిషు మాధ్యమంలో పరీక్షలు రాశారని అధికారుల వెల్లడి.

చదవండి: రేపు ‘TET’.. పేపర్‌–1.. పేపర్‌–2కు ఇంత‌ మంది అభ్యర్థులు..

టోఫెల్‌ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధపైనా ఆరా తీసిన సీఎం
వారంలో మూడురోజులపాటు మూడు పీరియడ్ల మేర శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడి. ప్రతిరోజూ కూడా కనీసం అరగంట సమయం ఉండేలా చూడాలన్న సీఎం. దీనివల్ల పిల్లలు క్రమంగా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారన్న సీఎం.

ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) సీలబస్‌పైనా సమావేశంలో చర్చ. ప్రభుత్వ స్కూళ్ల ప్రొఫైల్స్‌ మారాలన్న సీఎం. బయట స్కూళ్లకంటే, ప్రభుత్వ స్కూళ్లే ఉన్నతం అన్న రీతిలో మన స్కూళ్లు తయారు కావాలన్న సీఎం. ఇప్పటికే ఇంగ్లిషు మీడియం, తరగతి గదుల డిజిటలీకరణ, నాడు – నేడు పనులు చేపడుతున్నాం. వీటికి తోడు ఐబీ లాంటి సిలబస్‌ను తీసుకురావడం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల దశ మరో స్థాయికి చేరుకుంటుందన్న సీఎం.

ఐబీ సిలబస్‌ను ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశం. ఐబీ సిలబస్‌ విషయంలో దశలవారీగా అమలుచేసే విషయంపైనా అధ్యయనం చేయాలన్న సీఎం. ప్రస్తుతం అనుసరిస్తున్న సిలబస్, ఐబీ సిలబస్‌తో అనుసంధానం, ట్రాన్సిషన్‌ సజావుగా, సులభంగా ఉండేలా మార్గదర్శక ప్రణాళికలో పొందుపరచాలన్న సీఎం. మార్గదర్శక ప్రణాళిక తయారులో వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక భవిష్యత్‌ టెక్నాలజీపై అవగాహన, శిక్షణపై సమావేశంలో చర్చ.

చదవండి: APBIE: ఇంటర్‌ చదువుతో ఉద్యోగం

సీఎం ఆదేశాలమేరకు ఆరోతరగతి నుంచి ప్రత్యేక సబ్జెక్టుగా బోధన ఇప్పించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. శిక్షణ, బోధన కార్యక్రమాలకు సమీపంలోని ఇంజినీరింగ్‌ కాలేజీలను అనుసంధానం చేస్తున్నామన్న అధికారులు. ఏఐపై పాఠ్యాంశాలు బోధించేందుకు యాప్‌ కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామన్న అధికారులు.

మన బడి నాడు–నేడు పనులపై సీఎం సమీక్ష
చురుగ్గా రెండో విడత నాడు – నేడు పనులు జరుగుతున్నాయన్న అధికారులు. ప్రతిమండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు, అందులో ఒకటి బాలికలకోసం పెట్టాలన్న సీఎం ఆదేశాలమేరకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. రాష్ట్రంలోని 679 మండలాల్లో 473 మండలాల్లో ప్రభుత్వ బాలికలు మరియు కో –ఎడ్యుకేషన్‌ కాలేజీలు. కేవలం రెండు మండలాల్లో బాలికలకు కాలేజీలు లేవు. 206 మండలాల్లో కో ఎడ్యుకేషన్‌ జూనియర్‌ కాలేజీలు లేవు. కేవలం బాలికలకోసం జూనియర్‌ కాలేజీలు ఉన్నాయన్న అధికారులు.

అక్కడున్న హైస్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. జూనియర్‌ కాలేజీలుగా మార్చడానికి గుర్తించిన హైస్కూళ్లతో జాబితాను రూపొందించామని తెలిపిన అధికారులు. ఖరారు చేసిన తర్వాత ఈ హైస్కూళ్లలో అవసరం మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణం, తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్న అధికారులు. ఐఎప్‌పీ సహా అన్నిరకాల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయాలన్న సీఎం.

ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే...: 

  • ఈ ప్రభుత్వం వచ్చాక బడి పిల్లలకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాం: సీఎం.
  • గతంలో ఎప్పుడూ లేనివిధంగా డబ్బు ఖర్చుచేస్తున్నాం:
  • మెనూను మార్చి పిల్లలకు రుచికరమై, పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం:
  • రాగిజావను కూడా ప్రవేశపెట్టాం :
  • ఎట్టి పరిస్థితుల్లోనూ క్వాలిటీ తగ్గకూడదు:
  • నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి:
  • ప్రతిరోజూ కూడా పిల్లలకు అందిస్తున్న ఆహారంపై పర్యవేక్షణ ఉండాలి :
  • దీనివల్ల నాణ్యత ఎప్పటికీ నిలిచి ఉంటుందన్న సీఎం.
  • ఈమేరకు ఎస్‌ఓపీ ఉండాలని అధికారులకు ఆదేశం. 
  • ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో బలహీనంగా, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలపై శ్రద్ధపెట్టాలన్న సీఎం. 
  • వారికి మంచి పౌష్టికాహారం, మందులు అందేలా తగిన చర్యలు తీసుకోవాలి
Published date : 14 Sep 2023 05:26PM

Photo Stories