Police Jobs: దేహదారుఢ్య పరీక్షల్లో 342 మంది అర్హత
Sakshi Education
నగరంపాలెం (గుంటూరు తూర్పు): గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఎస్‌ఐ అభ్యర్ధుల దేహదారుఢ్య పరీక్షలు సెప్టెంబర్ 13న కొనసాగాయి.
గడచిన మూడు రోజుల్లో సెప్టెంబర్ 10న ఒకటి రాగా, మరో రెండు రోజులు వర్షం కారణంగా రద్దు చేశారు. సెప్టెంబర్ 13న తిరిగి కొనసాగాయి. గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి గ్రౌండ్‌లో పర్యటించారు. తొలుత అభ్యర్ధుల ఒరిజినల్ / నకళ్ల ధ్రువీకరణ పత్రాలను కూలంకషంగా పోలీస్ అధికార / సిబ్బంది పరిశీలించారు. అనంతరం బయోమెట్రిక్, ఎత్తు, ఛాతీ కొలతలను నమోదు చేసుకున్నారు.
100, 1,600 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. 664 మంది ఎస్‌ఐ అభ్యర్ధులకు 342 మంది అర్హత సాధించారు. ఏఎస్పీ కె.సుప్రజ, డీఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌రావు, ఐజీ కార్యాలయపు సీఐ సుధాకర్, రేంజ్‌లోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: Inspiring Story : హ్యాట్స్ ఆఫ్ జయలక్ష్మి.. చెత్త బండి లాగుతూ.. చదువుతూ.. ఐఏఎస్..
Published date : 14 Sep 2023 01:33PM