Skip to main content

APBIE: ఇంటర్‌ చదువుతో ఉద్యోగం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇంటర్మీడియెట్‌ పూర్తి కాగానే విద్యార్థులు ఉద్యోగస్తులుగా మారనున్నారు.
APBIE ,Kambalacheruvu, EducationOpportunity, StudentsToEmployees
ఇంటర్‌ చదువుతో ఉద్యోగం

 అదికూడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో కొలువు. ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కూడా ఉంది. ఇంటర్మీడియెట్‌ బోర్డు, హెచ్‌సీఎల్‌ టెక్‌ బి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 75 శాతం మార్కులతో ఇంటర్‌ పూర్తి చేసిన అన్ని గ్రూపుల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అందనున్నాయి. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో 2023–23లో ఇంటర్‌ పూర్తి చేసిన వారికి, 2024 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు.

చదవండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!

ఆసక్తి కలవారు నవంబర్‌లో రిజిస్ట్రేషన్ల పక్రియ పూర్తి చేయాలి. నమోదు చేసుకున్న విద్యార్థులకు మూడు దశల్లో ఎంపిక పక్రియ చేపడతారు. మొదట క్యాట్‌ ఎగ్జామ్‌, తర్వాత ఇంగ్లిష్‌ వర్సంట్‌ పరీక్ష, ఫైనల్‌గా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ మూడింటిలో ఉత్తీర్ణత సాధించాక, ఒక ఏడాది శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కాలంలో ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేల స్టైఫండ్‌ ఇస్తారు. విద్యార్థులు రెండు విభాగాల్లో ఉద్యోగాలు అందుకోవచ్చు. ఇంటర్‌ ఎంపీసీ, ఎంఈసీ చదివిన విద్యార్థులు ఐటీ రంగంలోనూ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్‌ కోర్సులు చదివిన వారికి అడ్మినిస్ట్రేటివ్‌కు సంబంధించి డీపీవో విభాగంలోనూ ఉద్యోగాలు అందించనున్నారు.

చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!

ఉద్యోగం చేస్తూ ఉన్నత విద్య

ఇంటర్‌తో ఉద్యోగంలో చేరిన విద్యార్థులు వారి చదువు అక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రణాళిక రూపొందించారు, దీనికి పలు ఉన్నత యూనివర్సిటీల నుంచి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. వీటిలో బిట్స్‌ పిలానీ, శస్త్ర, ఎమిటీ, ఐఐఎం నాగ్‌పూర్‌, కేల్‌ యూనివర్సిటీలున్నాయి. వీటిలో ఉన్నత విద్యను అభ్యసించే దిశగా విద్యార్థులు చెల్లించే ఫీజులో కొంత హెచ్‌సీఎల్‌ కంపెనీ రూ.15 వేలు ఏటా ఫీజుకు ఇవ్వనుంది.

Published date : 14 Sep 2023 12:24PM

Photo Stories