ప్రత్యేక పిల్లలకు భరోసా
మొత్తం రూ.49.11 లక్షలను లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసింది. జిల్లా వ్యాప్తంగా 31 భవిత కేంద్రాల పరిధిలో మొత్తం 3,426 మంది ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించారు. బుద్ధిమాంధ్యత (ఎంఆర్), చూపులోపం (బ్‌లైండ్), వినికిడి (హెచ్‌ఐ), సీపీ (సెరబ్రల్ పల్సీ) బాధితులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రాలకు వెళ్తున్నారు. 630 మంది పిల్లలు ఫిజియోథెరపీ, 135 మంది పిల్లలు స్వీచ్ థెరపీ చేయించుకుంటున్నారు. తీవ్రతను బట్టి కొందరికి హోం బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ)లు స్వయంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లల ఇళ్లకు వెళ్లి చిన్నచిన్న పనులు వారే స్వతహాగా చేసుకునేలా శిక్షణ ఇస్తున్నారు. భవిత కేంద్రాలకు వచ్చే పిల్లలకు రవాణాభత్యం, సొంతంగా రాలేనటువంటి పిల్లలను తీసుకొచ్చేవారికి ఎస్కార్ట్ అలవెన్స్, ఆడ పిల్లలకు స్టయిఫండ్, హోంబేస్డ్ ఎడ్యుకేషన్ తీసుకునేవారికి అలవెన్స్‌ను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏడాదిలో పది నెలల పాటు నెలకు ఆడపిల్లకు స్టయిఫండ్ రూ. 200, తక్కిన వారికి నెలకు రూ. 300 చొప్పున చెల్లిస్తారు. 2022–23 సంవత్సరానికి సంబంధించి మొత్తం అలెవెన్స్ ఒకేసారి జమచేశారు.
చదవండి:
Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్ విద్యార్థులకు మాక్‌టెస్టులు..
High Court: ఈ ఉద్యోగులు పరీక్ష ఎలా రాస్తారు?
TSPSC: పరీక్షపత్రాల లీకేజీ.. రంగంలోకి ఈడీ..
AP EAPCET 2023: ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఇసారి ఈ అడ్మిషన్లు ఇలా..