Exam Papers Evaluation: జవాబుపత్రాల మూల్యాంకన కేంద్రాల్లో ఏర్పాట్లు
ఏలూరు: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనానికి ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని పీఆర్‌టీయూ నాయకులు డీఈఓ ఎస్. అబ్రహంను కోరారు. గురువారం డీఈఓ కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. మూల్యాంకన కేంద్రాల్లో గాలి, వెలుతురు, సౌకర్యవంతమైన బెంచీలు, మంచినీరు, మరుగుదొడ్లు, మెడికల్ ఎమర్జన్సీ వంటివి ఏర్పాట్లు చేయాలని కోరారు.
Gurukuls admissions : గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వివిధ ఇబ్బందులతో దరఖాస్తు చేసుకున్న వారందరికీ మూల్యాంకన విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. జిల్లావ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన డీఈఓకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి కేవీవీ సుబ్బారావు, పెదపాడు మండల అధ్యక్షుడు ఎండీ మురసలీన్ ఉన్నారు.
DSC 2024 Updates : వీరికి ఈ సారి డీఎస్సీకి చాన్స్ లేనట్టే.. కారణం ఇదే..!