AP Tenth Exams: టెన్త్ పరీక్షలకు అన్ని విధాల భద్రతా చర్యలు
మదనపల్లె సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో తప్పిదాలకు ఆస్కారం లేని విధంగా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల విద్యార్థి జీవితంలో కీలకమైన పదో తరగతి అధిగమించేందుకు విద్యార్థులు పడుతున్న కష్టానికి ప్రతిఫలంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ, మరో వైపు పేపర్ లీకేజీ పేరుతో తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.
Bus Arrangements: ఇంటర్ పరీక్షలకు ఆర్టీసీ ఏర్పాట్లు..
ఈనెల 18 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల నుంచి 25,522 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 129 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏడు పేపర్ల విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి.
Medical Students Graduation Day: ఘనంగా వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం వేడుక
లీకేజీ పుకార్లకు ఆస్కారం లేని విధంగా...
పరీక్షలు ప్రారంభమైన రోజు మొదలు విద్యార్థులతో వారి తల్లిదండ్రుల ముఖాల్లో ఆందోళన కనిపిస్తుంది. అత్యంత కీలకమైన పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న రోజున పేపర్ లీకేజీ అని కొంత మంది అపరిచిత వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేసి, విద్యార్థులను మరింత ఆందోళనకు గురి చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు, పుకార్లకు ఆస్కారం కలిగించకుండా భద్రతా చర్యలు చేపట్టింది. ఆధునికత సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షల్లో తప్పిదాలకు అవకాశం లేకుండా చేయడంతో పాటు అత్యాధునిక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది.
TSPSC: గ్రూప్–1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
ప్రభుత్వ పరీక్షల విభాగం టెన్త్ ప్రశ్నాపత్రాలను సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన చేసింది. పరీక్షల్లో ఎక్కడైనా లీకేజీకి గురైతూ అది ఎక్కడ ఏ పరీక్ష కేంద్రంలో, ఏ రూములో, ఏ విద్యార్థి ప్రశ్నాపత్రం నుంచి జరిగిందనే సమాచారం తెలుసుకునే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. పనికట్టుకుని వ్యాపింపజేసే పుకార్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం కలుగుతుంది.
Free Coaching for Group Exams: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలతో గ్రూప్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ
మౌలిక సదుపాయల కల్పన
టెన్త్ పరీక్షలకు విద్యాశాఖాధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్, తాగునీటిని అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా, పరీక్షలు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టారు అధికారులు.
Indian Coast Guard Recruitment 2024: తీరదళంలో కమాండెంట్ కొలువులు.. పరీక్ష ఇలా..