TOEFL : టోఫెల్‌ పరీక్షలో మార్పులు.. ఇంగ్లిష్‌పై పట్టుతో మంచి స్కోర్‌కు మార్గం!

టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఎ ఫారెన్‌ లాంగ్వేజ్‌.. సంక్షిప్తంగా.. టోఫెల్‌! అమెరికా సహా పలు దేశాల్లో ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు తప్పనిసరి పరీక్ష టోఫెల్‌!!

అకడమిక్‌ రికార్డ్‌ ఎంత బాగున్నా.. ప్రవేశాల ఖరారులో టోఫెల్‌ స్కోర్‌ కీలకంగా నిలుస్తోంది. మన దేశం నుంచి ఏటా లక్షల మంది వివిధ దేశాల్లో ఉన్నత విద్య కోర్సుల్లో చేరే ప్రయత్నాలు చేస్తుంటారు. వీరంతా బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి కోర్సుల ఫైనల్‌లో ఉండగానే టోఫెల్‌కు హాజరవుతున్నారు. ఇటీవల టోఫెల్‌ పరీక్ష విధానంలో పలు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. టోఫెల్‌ కొత్త విధానం, సిలబస్‌ విశ్లేషణ, బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలు తదితర వివరాలు.. 

భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పించేముందు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి. టోఫెల్, ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్లను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. కాబట్టి విదేశీ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు టోఫెల్‌లో బెస్ట్‌ స్కోర్‌ సాధించేలా కృషి చేయాలి.

AIASL Contract Jobs : ఏఐఏఎస్‌ఎల్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌రఖాస్తులు

13 వేల ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రామాణికం

అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా 13 వేలకుపైగా ఇన్‌స్టిట్యూట్‌లు టోఫెల్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.అకడమిక్‌గా ఎంత మెరిట్‌ ఉన్నప్పటికీ.. లాంగ్వేజ్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో స్టడీ అబ్రాడ్‌ విద్యార్థులకు టోఫెల్‌ స్కోర్‌ అత్యవసరంగా మారింది. కొద్దిరోజుల క్రితం టోఫెల్‌ నిర్వాహక సంస్థ ఈటీఎస్‌ పరీక్ష విధానాన్ని కొంత సులభతరం చేస్తూ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది.

రెండు గంటల పరీక్ష

టోఫెల్‌లో మార్పుల్లో భాగంగా పరీక్ష వ్యవధిని రెండు గంటలకు కుదించారు. ప్రస్తుతం నాలుగు విభాగాల్లో.. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్‌పై మూడు గంటల వ్యవధిలో పరీక్ష జరుగుతోంది. తాజా నిర్ణయం ప్రకారం–నూతన విధానంలో రెండు గంటల వ్యవధిలోపు పూర్తి చేసుకునే విధంగా టోఫెల్‌ స్వరూపంలో మార్పులు చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

రీడింగ్‌ సెక్షన్‌

రెండు ప్యాసేజ్‌ల నుంచి 10 ప్రశ్నలు చొప్పున మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి. 35 నిమిషాల వ్యవధిలో సమాధానాలు ఇవ్వాలి.

లిజనింగ్‌ సెక్షన్‌

మూడు లేదా నాలుగు లెక్చర్స్, ఒక్కో లెక్చర్‌ నుంచి 6 ప్రశ్నలు ఉంటాయి. అదే విధంగా రెండు లేదా మూడు సంభాషణలు ఇచ్చి.. ఒక్కో సంభాషణపై అయిదు ప్రశ్నలు ఉంటాయి. మొత్తంగా ఈ విభాగంలో 28 ప్రశ్నలు అడుగుతారు. సమాధానా­లు ఇచ్చేందుకు లభించే సమయం 36 నిమిషాలు.

Senior Engineer Posts : బెల్‌లో సీనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

స్పీకింగ్‌ సెక్షన్‌

ఇందులో నాలుగు టాస్క్‌లు ఉంటాయి. అవి.. ఇండిపెండెంట్‌ టాస్క్‌–1,ఇంటిగ్రేటెడ్‌ స్పీకింగ్‌ టా­స్స్‌–2,3,4. లభించే సమయం 16 నిమిషాలు. అ­భ్యర్థులు ఏదైనా టాపిక్‌పై చర్చించాల్సి ఉంటుంది. 

రైటింగ్‌ సెక్షన్‌

ఇందులో రెండు టాస్క్‌లు ఇచ్చి.. దాని ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. టాస్క్‌–1లో రైటింగ్‌ ఇంటిగ్రేటెడ్‌ టాస్క్, టాస్క్‌–2లో అకడమిక్‌ రైటింగ్‌ డిస్కషన్‌ టాస్క్‌ ఉంటాయి. ఒక్కో టాస్క్‌కు 29 నిమిషాల సమయం కేటాయిస్తారు.

రైటింగ్‌ ఫర్‌ యాన్‌ అకడమిక్‌ డిస్కషన్‌

టోఫెల్‌ నూతన విధానంలో.. రైటింగ్‌ టాస్క్‌లో కొత్తగా ‘రైటింగ్‌ ఫర్‌ యాన్‌ అకడమిక్‌ డిస్కషన్‌’ టాస్క్‌ పేరుతో కొత్త టాస్క్‌ను చేర్చారు. ఇందులో అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఇచ్చిన ప్రశ్నను చదివి, దానికి అప్పటికే ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన సమాధానాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. వాటిని పరిగణనలోకి తీసుకుంటూ.. అదే అకడమిక్‌ అంశంపై సమాధానాన్ని ఇవ్వడంతోపాటు, తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించాల్సి ఉంటుంది.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

స్కోర్‌ తేదీ తెలుసుకునే అవకాశం

టోఫెల్‌ కొత్త విధానంలో అభ్యర్థులు పరీక్ష పూర్తి కాగానే.. తమ అధికారిక స్కోర్‌ను చూసుకునే సదుపాయం కూడా కల్పించారు. దీనివల్ల అభ్యర్థులు ఫలితాల కోసం ఈటీఎస్‌ పంపే సమాచారం కోసం వేచి చూసే పరిస్థితికి ఫుల్‌స్టాప్‌ పడనుంది. పరీక్ష సమయంలో ఎప్పటికప్పుడు అభ్యర్థులకు తాజా సూచనలు అందిస్తూ.. వారికి ఆన్‌లైన్‌ విధానంలో సహకరించే పద్ధతిని కూడా అమలు చేయనున్నారు.

టోఫెల్‌.. ముఖ్య సమాచారం

     రెండు గంటల వ్యవధిలోపే పరీక్ష.
     రెటింగ్‌ విభాగంలో రైటింగ్‌ ఫర్‌ యాన్‌ అకడమిక్‌ డిస్కషన్‌ టాస్క్‌.
     పరీక్ష ముగిసిన వెంటనే స్కోర్‌ వెల్లడి తేదీని చూసుకునే అవకాశం.
     స్థానిక కరెన్సీ(రూపాయల్లో)లో ఫీజు చెల్లించే సదుపాయం.
     ఏడాది పొడవునా పరీక్షకు హాజరయ్యే అవకాశం.
Apprentice Training : ఐవోసీఎల్‌లో ఏడాది అప్రెంటీస్ శిక్ష‌ణకు ద‌ర‌ఖాస్తులు
     ఒక సెషన్‌కు మరో సెషన్‌కు మధ్య 12 రోజుల వ్యవధి తప్పనిసరి.
     బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో 90కుపైగా స్కోర్‌తోనే ప్రవేశాలు.
     పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: ఠీఠీఠీ.్ఛ్టట.ౌటజ/్ట్ఛౌజ .జ్టిఝ

టోఫెల్‌లో రాణించేలా

రీడింగ్‌

ఈ విభాగంలో అభ్యర్థులకు అకడమిక్‌ సంబంధిత ప్యాసేజ్‌లు ఇస్తారు. వీటి ఆధారంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విభాగం ప్రధాన ఉద్దేశం.. అభ్యర్థులకు యూనివర్సిటీ స్థాయి అకడమిక్స్‌ను అవగాహన చేసుకోగలరా? లేదా? అనేదే. అభ్యర్థులు తమ అకడమిక్‌ అర్హతలకు అనుగుణమైన పాఠ్య పుస్తకాలను నిరంతరం చదువుతుండాలి. అదేవిధంగా ఆయా అకడమిక్స్‌లో ముఖ్యమైన అంశాలను గుర్తించి, వాటిని పునశ్చరణ చేసుకోవాలి.

లిజనింగ్‌ టెస్ట్‌

ఈ విభాగంలో క్లాస్‌ రూం డిస్కషన్స్, లెక్చర్స్‌ లేదా ఇతర సంభాషణలు సమ్మిళితంగా ఉండే ఆడియోను వినాల్సి ఉంటుంది. ఆ సంభాషణల ఆడియో పూర్తయిన తర్వాత వాటి ఆధారంగా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఆడియోకు సంబంధించి ఆరు ప్రశ్నలు అడుగుతారు.ఇందులో రాణించాలంటే..ఇంగ్లిష్‌ న్యూస్‌ ఛానెళ్లను వీక్షించడం, అందులోని చర్చలను అనుసరిస్తూ భాష,యాసపై అవగాహన పెంచుకోవాలి.

Ekalavya schools teachers recruitments: ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి ఇంటర్వ్యూలు ప్రారంభం

రైటింగ్‌ టెస్ట్‌

ఈ విభాగంలో అభ్యర్థులు అంతకుముందు దశలైన రీడింగ్, లిజనింగ్‌ విభాగాల్లో తమకు ఎదురైన అంశాల్లో రెండింటిపై ఎస్సే రాయాల్సి ఉంటుంది. 

స్పీకింగ్‌ టెస్ట్‌

రైటింగ్‌ టెస్ట్‌లో మాదిరిగానే ఇందులో కూడా అభ్యర్థులు అప్పటికే తాము ఎదుర్కొన్న రీడింగ్, లిజనింగ్‌ విభాగాల్లో పేర్కొన్న అంశాలు, లేదా కొత్త అంశాలపై తమ అభిప్రాయాలను చర్చా రీతిలో వ్యక్తం చేయాల్సి ఉంటుంది.

Indian Polity Bit Bank: అతి తక్కువ కాలం పదవిలో ఉన్న రాష్ట్రపతి ఎవరు?

రిజిస్ట్రేషన్‌ ఇలా

టోఫెల్‌ అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్ష కోసం ఎప్పుడైనా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. పరీక్ష కూడా ఏడాది పొడవునా.. నిర్ణీత తేదీల్లో జరుగుతుంది. పరీక్షకు హాజరయ్యే విషయంలో ఎలాంటి పరిమితి లేదు. అభ్యర్థులు ఒక దశ పరీక్ష రాశాక.. కనీసం 12 రోజుల తర్వాత మాత్రమే మరో దశకు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన అమలవుతోంది. కాబట్టి తమ అడ్మిషన్‌ సెషన్, దరఖాస్తుకు ప్రారంభానికి వీలైనంత ముందుగా టోఫెల్‌కు హాజరై స్కోర్‌ సాధించేలా కృషి చేయాలి. వీలైనంత మేరకు రెండో అటెంప్ట్‌లోనే బెస్ట్‌ స్కోర్‌ దిశగా కృషి చేయాలి. రెండు కంటే ఎక్కువ అటెంప్ట్స్‌ రాసి బెస్ట్‌ స్కోర్‌ పొందినా.. దరఖాస్తు స్క్రూటినీ సమయంలో అభ్యర్థి ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యాంపై ఇన్‌స్టిట్యూట్స్‌ ప్రవేశ కమిటీలు ప్రత్యేక దృష్టి పెడతాయి.

DSC Free Coaching: డీఎస్సీ ఉచిత శిక్షణకు ఎంపిక పరీక్ష

#Tags