Contract Jobs Regularisation 2024 : ఏపీలో భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం భారీగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. ఈ మేర‌కు ప్ర‌త్యేక జీవోను జారీ చేశారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన 2,146 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరీస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2014 ఏప్రిల్ 1వ తేదీ నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న 2,146 మందిని రెగ్యులరైజ్ చేస్తూ వైద్యశాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు జీవో జారీ చేశారు.

☛ TTD Recruitment: టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎంపికైతే భారీగా వేతనాలు.. ఎంతంటే..? 

అమలులోకి ఎప్ప‌టినుంటి అంటే..?
పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2,025 మంది, DME పరిధిలో 62, కుటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాల్లో నలుగురిని క్రమబద్ధీకరణ చేశారు. ఈ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ  2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుందని ఉత్తర్వులలో పేర్కొంది. అలాగే ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది శాంక్షన్ పోస్టులలో సంబంధించిన పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులను చేసినట్లు తెలిపారు.

☛ Government Job Notifications: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీలు ఇవే..

#Tags