Inspirational Success Story : ఒక వైపు తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు కుటుంబంపై నింద‌లు.. ఈ క‌సితోనే చ‌దివి డీఎస్పీ ఉద్యోగం కొట్టానిలా..

ప్ర‌తి విజయం వెనుక‌ ఏదో ఒక కారణం ఉంటుంది. కొంద‌రి విజ‌యం వెనుక ఒక బ‌ల‌మైన బాధతో వ‌చ్చిన ల‌క్ష్యం ఉంటుంది. అలాగే ఎన్నో అవ‌మానాలు కూడా ఉంటాయి. కానీ ఈమె స్టోరీలో మాత్రం.. తండ్రి మ‌రణించిన తర్వాతే పోలీసు అధికారిణి కావాలని.. నేరస్థులను పట్టుకోవాలని బాధితులకు న్యాయం చేయాలనీ నిర్ణయించుకుంది.
Ayush Singh, DSP Success Story

ఈమే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఆయుషి సింగ్. ఈ ఇటీవ‌ల విడుద‌లైన ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫ‌లితాల్లో మంచి ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది. ఈ నేప‌థ్యంలో ఆయుషి సింగ్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం.. 

☛➤ Success Story : యూట్యూబ్ పాఠాలే.. ఫాలో అయ్యా.. స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యానిలా..

కుటుంబ నేప‌థ్యం :

ఆయుషి సింగ్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వారు. ఈమె తండ్రి యోగేంద్ర సింగ్. ఈయ‌న‌ మొరాదాబాద్‌లోని దిలారీ మాజీ బ్లాక్ చీఫ్.

ఎడ్యుకేష‌న్ : 
ఆయుషి సింగ్.. హైస్కూల్, ఇంటర్మీడియట్ మొరాదాబాద్‌లో చదివింది.  2019 లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసింది.
అనంతరం 2021లో పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేశారు. నెట్ (NET) పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించింది. గత రెండేళ్లుగా యూపీపీఎస్సీ సివిల్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేరై అవుతోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ ఫ‌లితాల్లో విజయం సాధించారు. ఆమె రెండో ప్రయత్నంలో పీసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.

☛➤ Babli Kumari Success Story : ఒకప్పుడు నేను సెల్యూట్ చేసే అధికారులకు నేడు నేనే బాస్‌.. ఈ క‌సితోనే..

ఈమె విజ‌యం వెనుక‌..

అయితే ఈ విజయం వెనుక ఒక దుఃఖం దాగి  ఉంది. వాస్తవానికి ఎనిమిదేళ్ల క్రితం ఆయుషి తండ్రి యోగేంద్ర సింగ్ అలియాస్ ‘భురా’ కోర్టులో హాజరుపరిచే సమయంలో హత్య చేయబడ్డాడు. ఆ సమయంలో ఆయుషి సింగ్ తండ్రి మొరాదాబాద్‌లోని దిలారీ మాజీ బ్లాక్ చీఫ్. నిజానికి ఆయుషి 2015లో తన తండ్రి మరణించిన తర్వాతే పోలీసు అధికారిణి కావాలని..  నేరస్థులను పట్టుకోవాలని బాధితులకు న్యాయం చేయాలనీ నిర్ణయించుకుంది. ఆయుషి తాను కలను నెరవేర్చుకోవడానికి ఇదే కారణం. 

అయితే పీసీఎస్‌లో ఉత్తీర్ణత సాధించిన ఆయుషి మాట్లాడుతూ.. తాను డీఎస్పీ అయినప్పటికీ.. నా టార్గెట్‌ ఐపీఎస్ కావడమే. ఆయుషి.. సాధించిన విజ‌యంకు ఆమె కుటుంబం మొత్తం నేడు సంతోషంగా ఉంది. అయితే ఈ విజయం వెనుక ఒక దుఃఖం దాగి ఉంది.

nspiring Success Story : ఒకే జిల్లా. ఒకే బ్యాచ్‌.. ఎస్సై జాబులు కొట్టారిలా.. సొంత ఊరు కోసం..

తండ్రి మ‌ర‌ణంతో పాటు.. కుటుంబం పై నిందలు.. కానీ

ఆయుషి తండ్రి యోగేంద్ర సింగ్ భూరాపై హత్యతో పాటు అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆయుషి తండ్రి వంచకుడు అనే పేరు రావడానికి ఇదే కారణం. ఆయుషి తండ్రి మోసగాడు.. అంటూ ఆ కుటుంబంపై నిందలు పడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు అదే కుటుంబం నుంచి ఆయుషి సింహ కుటుంబంగా పిలువబడుతుంది.

☛ IAS Success Story : ఫెయిల్..ఫెయిల్..ఫెయిల్.. చివ‌రికి ఐఏఎస్‌ కొట్టానిలా..

నిజానికి ఆయుషి 2015లో తన తండ్రి మరణించిన తర్వాతే పోలీసు అధికారిణి కావాలని..  నేరస్థులను పట్టుకోవాలని బాధితులకు న్యాయం చేయాలనీ నిర్ణయించుకుంది. ఆయుషి తాను కలను నెరవేర్చుకోవడానికి ఇదే కారణం. 

నా సక్సెస్‌కు కార‌ణం వీరే..

తాను సాధించిన ఘనత తన తండ్రి కల అని ఆయుషి చెప్పారు. మొదటి నుంచి తండ్రికి తాను పోలీసు అధికారి కావాలనే కోరిక ఉండేదన్నారు. ఇప్పుడు తన తండ్రి కల నెరవేరింద‌న్నారు. తమ చదువుల కోసం మొరాదాబాద్‌లో నా తండ్రి ఇల్లు కట్టారని ఆయుషి గుర్తు చేశారు. తన తండ్రిని కాల్చి చంపిన సమయంలోనే .. భవిష్యత్తులో పోలీసు అధికారి కావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రిజల్ట్ రాగానే వెంటనే ఫోన్ చేసి నా తల్లికి సమాచారం ఇచ్చానని చెప్పారు. నా తల్లి ఆ స‌మ‌యంలో ఎంతో ఉద్వేగానికి లోనైంది. ఎట్టకేలకు నేను నాన్న కలను నెరవేర్చారు. 

ఇప్పుడు పోలీసు ఆఫీసర్‌గా నియమించబడడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. నా విజయంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని చెప్పారు ఆయుషి.

☛➤ Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

➤ Success Story : ఒకే క‌ల‌.. ఒకే స్టడీ మెటిరీయల్ చ‌దువుతూ.. అక్కాచెల్లెళ్లిద్దరూ ఐఏఎస్ ఉద్యోగం కొట్టారిలా..

#Tags