Babli Kumari Success Story : ఒకప్పుడు నేను సెల్యూట్ చేసే అధికారులకు నేడు నేనే బాస్.. ఈ కసితోనే..
కృషి పట్టుదల చేపట్టిన పనిని ఎట్టి పరిస్థితుల్లోనైనా సాధించాలనే ధృడ సంకల్పం ఉంటే మిమ్మల్ని విజయం సాధించకుండా ఏ శక్తీ అడ్డుకోదు అని అంటారు ఈమె . మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తే.. మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ గమ్యాన్ని చేరుకుంటారు. ఈమె బబ్లీ కుమారి,డీఎస్పీ. ఈ నేపథ్యంలో బబ్లీ కుమారి సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
బబ్లీ కుమారి.. బీహార్‌లోని బెగుసరాయ్ నివాసి. ఆమె నిరుపేద కుటుంబం. ఈమె కష్టపడి చదువుకుంది. తల్లిదండ్రులు తమ బాధ్యతను తీర్చుకోవడం కోసం 2013 సంవత్సరంలో చిన్న వయస్సులోనే వివాహం చేశారు. పెళ్లి అయిన తర్వాత భర్త ప్రోత్సాహంతో ఉద్యోగ ప్రయత్నం చేయడం మొదలు పెట్టింది. 2015లో బాబ్లీకి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. ఆమెకు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. ఓ వైపు ఇల్లాలుగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు భర్త ప్రోత్సాహంతో మళ్ళీ ఉన్నత ఉద్యోగం కోసం చదువుకోవడం ప్రారంభించింది.
భర్తకు అండతో..
బబ్లీ.. ప్రిపేరేషన్ సమయంలో.. భర్తకు అండగా నిలబడ్డాడు. భార్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే.. తాను ఇంటి బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నాడు. దీంతో బబ్లీ ఉన్నత ఉద్యోగం కోసం చదవడం మొదలు పెట్టింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ బబ్లీ తన మూడో ప్రయత్నంలో బీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.
ఓ మహిళ.. కానిస్టేబుల్ ఒకప్పుడు తాను సెల్యూట్ చేసే అధికారులకు నేడు ఇప్పుడు బాస్‌గా మారింది. ఎంతో కష్టపడి చదివి.. కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం బాబ్లీ విజయంపై పెద్దపెద్ద ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ప్రశంసల వర్షం కురిపింస్తున్నారు. ఆమె విజయగాథ కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తుంది.
ఈ విజయం వెనుక పెద్ద పోరాటమే..
బీహార్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసిన బాబ్లీ ఇప్పుడు డీఎస్పీగా విధులను నిర్వహిస్తున్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 66వ పరీక్షలో 208వ ర్యాంకుతో బబ్లీ ఉత్తీర్ణత సాధించారు. వాస్తవానికి బాబ్లీకి ఈ విజయం అంత తేలికగా లభించలేదు.. ఈ విజయం వెనుక పెద్ద పోరాటమే చేసింది. అత్తమామల నుంచి పూర్తి మద్దతు లభించింది. బాబ్లీ పెళ్లి తర్వాత చదువుకోవాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు, ఆమె అత్తమామలు కూడా ఆమెకు బాగా మద్దతు ఇచ్చారు. కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చిన అనంతరం ఓ వైపు పోలీస్ స్టేషన్ లో విధులను నిర్వహిస్తూనే.. మరోవైపు బీపీఎస్సీకి ప్రిపేర్ అయింది. అయితే బబ్లీ త్రిపాత్రాభినయం చేయాల్సి వచ్చింది. ఓ వైపు డ్యూటీ.. మరోవైపు చదువు.. ఇక ఓ బాబుకు తల్లి.. దీంతో చదువు ఆమెకు పెద్ద సవాల్‌గా మారింది.
భార్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే.. భర్త మాత్రం..
అప్పడు బబ్లీ భర్తకు అండగా నిలబడ్డాడు. భార్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే.. తాను ఇంటి బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నాడు. దీంతో బబ్లీ ఉన్నత పదవి కోసం చదవడం మొదలు పెట్టింది. సవాళ్లను ఎదుర్కొంటూ బబ్లీ తన మూడో ప్రయత్నంలో బీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీగా మారిన బబ్లీ రాజ్‌గిర్ శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకుంది.
ఆర్థిక సమస్యలు తీరాలంటే ప్రభుత్వ ఉద్యోగమే మార్గమని..
కానిస్టేబుల్ నుంచి డీఎస్పీగా మారిన బాబ్లీ.. ఇక్కడికి చేరుకోవడంలో నా ప్రయాణం అంత సులభం జరగలేదన్నారు. నేను మా కుటుంబానికి పెద్ద కూతురిని. అలాగే నాకు చాలా బాధ్యతలు కూడా ఉన్నాయన్నారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరాలంటే ప్రభుత్వ ఉద్యోగమే మార్గమని కష్టపడి చదివి.. ఈ రోజు డీఎస్పీ ఉద్యోగం సాధించాను. నేటి యువతకు బబ్లీ కుమారి సక్సెస్ జర్నీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది.