Yashaswini Reddy: అత్త వదిలిన బాణం
ఆమెకు భారత పౌరసత్వం రాకుండా వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. ‘ప్రజలకు నేను మాటిచ్చిన, మన కుటుంబం మాట తప్పిన కుటుంబం కావొద్దు’ అన్నది అత్తమ్మ. ఆమె లక్ష్యాన్ని సాధించడానికి నేను ముందుకు వచ్చాను. అత్తమ్మకు వారసురాలిగా పాలకుర్తి ప్రజల ప్రతినిధిగా చట్టసభలో అడుగుపెడతాను.
చదవండి: TS Elections 2023: ఎన్నికల బరిలో ఇంత మంది అభ్యర్థులు.. నియోజకవర్గాల వారీగా వివరాలివీ..
ప్రజాసేవ చేస్తాను. ఇకపై నా కుటుంబం అంటే మా ఇల్లే కాదు, పాలకుర్తి నియోజకవర్గమంతా నా కుటుంబమే. ప్రత్యర్థులు ఆరోపణలు ఎన్నైనా చేస్తారు.
ప్రత్యర్థి సీనియారిటీతో నా వయసును పోలుస్తున్నారు. ప్రజల అభిమానం మా వైపుంది. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే వయసు, అనుభవం లేకపోవడం సమస్యలు కావు. అవి లేని వాళ్లకు ఎంత అనుభవమున్నా ప్రజలు హర్షించరు.
– మామిడాల యశస్విని రెడ్డి, (ఎంఎస్, యుఎస్‌ఏ) పాలకుర్తి, కాంగ్రెస్