Open School Admissions: ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశాలు.. దరఖాస్తుకు ఇదే చివరి తేదీ

Open School Admissions

మదనపల్లె సిటీ: ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రవేశానికి ఈ నెల 28వతేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీనివాసరాజు, డీవైఈఓ శ్రీరాం పురుషోత్తం తెలిపారు. సోమవారం స్థానిక జీఆర్‌టీ ఉన్నత పాఠశాలలో ఓపెన్‌ స్కూల్‌ కరపత్రాలను ఆవిష్కరించారు.

KNRUHS MDS Final Merit List: ఎండీఎస్‌ ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

అనంతరం వారు మాట్లాడుతూ బడి మధ్యలో మానివేసిన విద్యార్థులకు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా తిరిగి విద్యను అభ్యసించడం ఒక వరమన్నారు. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా 14 సంవత్సరాలు వయసు పూర్తయినవారు పదవ తరగతిలో, 15 సంవత్సరాల వయస్సు పూర్తయి పదో తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందవచ్చునన్నారు.

JNTUH Btech Results Out: సెకండ్‌ ఇయర్‌ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో డైరెక్ట్‌ రిజల్ట్స్‌

ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పొందిన సర్టిఫికెట్‌ రెగ్యులర్‌ విద్యార్థులు పొందిన సర్టిఫికెట్‌తో సమానమైన విలువ కలిగి ఉంటుందన్నారు. దీని ద్వారా ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ తదితరత కోర్సులు పూర్తి చేసుకోవచ్చునన్నారు. ఈనెల 29,30 తేదీల్లో ఆన్‌లైన్‌లో రూ.200 అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో జిల్లా స్కౌట్స్‌,గైడ్స్‌ సెక్రటరీ నరసింహారెడ్డి,వెంకట్రామరాజు, ఎస్‌టీయు నాయకులు మధుసూధన్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags