Teachers Training : టీచర్లకు ఈనెల 21 నుంచి ఎఫ్‌ఎల్‌ఎన్ పేరుతో ప్రత్యేక శిక్షణ..
అనంతపురం: ఫౌండేషన్ లిటరసీ, న్యుమరసి (ఎఫ్‌ఎల్‌ఎన్) పేరుతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. 2026 నాటికి 1, 2 తరగతుల పిల్లలందరికీ కనీసం చదవడం, రాయడం సంపూర్ణంగా రావాలనే ఉద్దేశంతో ఈ శిక్షణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులపై బోధనా మెలకువలపై నిష్ణాతులైన వారితో అవగాహన కల్పించనున్నారు. 20 రోజుల చొప్పున మూడేళ్ల పాటు ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ కొనసాగనుంది. 20 రోజుల్లో ఆరు రోజులు భౌతిక (ఆఫ్‌లైన్) పద్దతిలో, 14 రోజులు ఆన్‌లైన్ పద్దతిలో శిక్షణ ఉంటుంది.
Degree Supplementary Results: డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
గురుకుల విధానంలో శిక్షణ
భౌతిక పద్దతిలో సాగే ఎఫ్‌ఎల్‌ఎన్ (జ్ఞానప్రకాష్ 60 రోజుల కార్యక్రమం) శిక్షణ ఈ నెల 21 నుంచి పూర్తిగా గురుకుల విధానంలో ప్రారంభం కానుంది. బుక్కరాయసముద్రం మండలంలోని ఓ డీఎడ్ కళాశాలను శిక్షణా కేంద్రంగా ఎంపిక చేశారు. జిల్లాలోని 31 మండలాల్లో మొత్తం 1,424 మంది టీచర్లను ఎంపిక చేయగా ఇందులో 756 మంది మహిళలు, 668 మంది పురుషులు ఉన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
అలాగే కర్నూలు జిల్లా నుంచి దాదాపు 1,250 మంది టీచర్లు హాజరుకానున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలతో పాటు వసతి సదుపాయం కల్పించనున్నారు. అనంతపురం జిల్లా నుంచి 125 మందిని, కర్నూలు జిల్లాకు చెందిన 125 మంది చొప్పున ఎంపిక చేసి ఒక్కో విడతకు 250 మంది చొప్పున ఆరు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. కాగా సింగిల్ స్కూల్ టీచర్లకు తొలి నాలుగు విడతలు మినహాయింపు ఉంటుంది. ఈ లోపు వారికి ఎలా శిక్షణ ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
అందరు హాజరుకావాల్సిందే
1,2 తరగతుల పిల్లలకు పూర్తిస్థాయి అభ్యసనం అమలు కావాలనే ఉద్దేశంతో మూడు సబ్జెక్టులపై టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది చాలా మంచి కార్యక్రమం. మండలాల వారీగా ఏ విడతలో ఎంతమందిని ఎంపిక చేశామో వారందరూ శిక్షణకు కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆరు రోజుల పాటు ఇక్కడే ఉండేలా సిద్ధమై రావాలి. ఏ చిన్న ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం.
– నాగరాజు సమగ్రశిక్ష ఏపీసీ
Tags
- teachers coaching
- first and second class teachers
- special training for teachers
- Foundation Literacy and Numeracy
- Foundation Literacy and Numeracy for teachers
- school teachers
- APC
- AP government
- ap school teachers
- six days training
- Education News
- Sakshi Education News
- FoundationLiteracyNumeracy
- PrimaryEducation
- LiteracySkills
- NumeracySkills
- EducationAwareness
- OnlineTraining
- OfflineTraining
- GovernmentInitiative