60 Years Celebrations For School: వజ్రోత్స‌వ వేడుక‌ల‌ను జ‌రుపుకుంటున్న శ్రీ‌శైలం ప్రాజెక్టు హైస్కూల్..

అస‌లు చ‌దువే ఉండ‌దు అనుకున్న స‌మ‌యంలో ఆ ప్రాంతంలో ఓ చ‌దువుల కోవెల వెలిసింది. అదే ఈ శ్రీ‌శైలం ప్రాజెక్ట్ హైస్కూల్. అక్క‌డ త‌మ విద్యా ప్ర‌యాణాన్ని మొద‌లు పెట్టిన విద్యార్థులు ఇప్పుడు ఉన్న‌త స్థాయికి ఎదిగారు. ఇప్పుడు వారే పాఠ‌శాల‌కు వ‌జ్రోత్స‌వ వేడుక‌ను జ‌రుగుపుతున్నారు. వజ్రోత్సవాలు జరుపుకుంటున్న శ్రీశైలం ప్రాజెక్ట్‌ హైస్కూల్‌ గురించి ప్రత్యేక కథనం.
Srisailam Project High School gets ready for 60 years celebrations

అక్కడ పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను ఒడిసిపట్టి గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన మహా సంకల్పంలో ఎందరో భాగస్వాములయ్యారు. శ్రీశైలం డ్యామ్‌ నిర్మాణంలో వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగాలు, జీవనోపాధి నిమిత్తం అక్కడికి చేరుకున్నారు. వారి పిల్లల కోసం అప్పుడు అక్కడ ఓ చదువుల కోవెల వెలిసింది. ఎంతో మందిని తీర్చిదిద్దింది. ఎంతలా అంటే కృష్ణా జల్లాలు బీడు భూములను ఎలా సస్యశ్యామలం చేశావో అలా ఇక్కడ చదువుకున్న వారు వివిధ హోదాల్లో స్థిరపడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. వారంతా నేడు అదే చదువులమ్మ ఒడిలో మరోసారి సమ్మేళనమవుతున్నారు.

➤   Talent Programs for Students: ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచేందుకు 'క‌ళ‌తిరువిజ పోటీలు..

పాఠశాలలో చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు..

● వీవీఎస్‌.లక్ష్మీనారాయణ, సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌

● జి.అశోక్ కుమార్‌, ఏలూరు రేంజ్‌ డీఐజీ

● రామ్‌మోహన్‌రావు, తెలంగాణ జెన్‌కో డైరెక్టర్‌

● కేవీఎన్‌ ప్రసాద్‌, పర్సనల్‌ సెక్రటరీ ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా

● ఎన్‌.హరినాథ్‌, పర్సనల్‌ సెక్రటరీ మాజీ మంత్రి అచ్చంనాయుడు

● యు.ఇలియాజర్‌, జాయింట్‌ సెక్రటరీ, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లండన్‌

● డాక్టర్‌.వరప్రసాద్‌, (రిటైర్డ్‌), డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌

● డాక్టర్‌.జ్యోత్స్న, (రిటైర్డ్‌) నిమ్స్‌ డైరెక్టర్‌

● సుధాకర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి, నంద్యాల

● ఎ.వెంకటేశ్వర్లు, వ్యాపారవేత్త

● విద్యాధరరావు, టీచర్‌, ఉన్నత పాఠశాల

● వైద్యులు జి.గీతా అరుణ, డి.మిరియాజిరావు, ఇన్నయ్య, స్వర్ణలత

● జి.ఎస్‌.రావు, ప్రముఖ సినీ రచయిత, డైరెక్టర్‌

● ఎ.మల్లికార్జున, సినీనటుడు

➤   Free training for women: మహిళలకు ఉచిత శిక్షణ

శ్రీశైలం ప్రాజెక్ట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 60 ఏళ్లు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలకు ముస్తాబైంది. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు శ్రీశైలం ప్రాజెక్ట్‌ ఉన్నత పాఠశాల ఓల్డ్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ (స్పోసా) ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. 60 ఏళ్లలో ఈ పాఠశాలలో చదువుకున్న వారందరూ ఒక వేదికపై కలవాలనే సంకల్పంతో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తున్నారు.

సుమారు 7 వేల మంది విద్యార్థులు వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. వారికి అవసరమైన వసతి, అల్పాహారం, భోజనం సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు శనివారం ఆరు వేల మందితో (అలూమినీ యాంతం) స్పోసా గీతాన్ని పాడనున్నారు. ఈ ఆలాపన వరల్డ్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లండన్‌లో నమోదు కానుంది.

➤   Rifle Shooting: రాష్ట్ర స్థాయి రైఫిల్ పోటీల‌కు ఎంపిక‌

ఆదివారం ఉదయం మెగా రక్తదాన, అవయవదాన శిబిరాన్ని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే శ్రీశైలం డ్యాం, ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన ఉద్యోగులను సన్మానించనున్నారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులంతా సంఘంగా ఏర్పడి పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం, పేద విద్యార్థులను ఆదుకోవడంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములై ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్వ విద్యార్థులు తమవంతుగా పాఠశాలలో మరమ్మతులు, పెయింటింగ్‌, సీసీ రోడ్డు నిర్మాణం వంటి పనులను చేయించారు. స్పోసా చైర్మన్‌, సీబీఐ మాజీ డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగే వజ్రోత్సవ వేడుకలకు అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి, తదితరులు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

➤   Exam : ఈ పరీక్షను తప్పనిసరిగా నిర్వహించాల్సిందే..

పాఠశాల చరిత్ర

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సాగు, తాగునీరు, విద్యుత్‌ ఉత్పాదన కోసం నాటి దేశప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1963 జూలై 24న శ్రీశైలం డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు, శ్రామికుల పిల్లల చదువుల కోసం నీటిపారుదల శాఖ ఉన్నత పాఠశాలను నిర్మించింది. ఉపాధ్యాయులను నియమించి వారికి జీతాలు చెల్లించడమే కాకుండా, పాఠశాల పరిపాలనను కూడా చూసుకునేది. అప్పట్లో ఏర్పడిన శ్రీశైలం డ్యాం ఈస్ట్‌ (కర్నూలు జిల్లా, సున్నిపెంట), శ్రీశైలం డ్యాం వెస్ట్‌ (తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా దోమలపెంట, ఈగలపెంట)లో నివసించే వారి పిల్లలంతా ఈ పాఠశాలలోనే చదువుకునేవారు.1982లో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఈ ఉన్నత పాఠశాలను విలీనం చేసుకుంది. ఎందరో ఈ పాఠశాలలో చదువుకున్న వారు అత్యున్నత అధికారులుగా, వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. దేశ, విదేశాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. చదువుకున్న పాఠశాల, పుట్టిన ఊరి కోసం పూర్వ విద్యార్థులు సంఘంగా ఏర్పడి సహాయ, సహకారాలు అందిస్తున్నారు.

➤   Job fair for unemployed youth: నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా

స్పోసా ఆధ్వర్యంలో అభివృద్ధి

శ్రీశైలం ప్రాజెక్ట్‌ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పడిన తరువాత ఇక్కడి ఉన్నత పాఠశాల, కళాశాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రూ.1.5 కోట్లతో తరగతి భవనాల మరమ్మతులు, మెగా మెడికల్‌ క్యాంప్‌, అవయవదాన, రక్త దాన శిబిరాలను నిర్వహించారు. పేద విద్యార్థులకు గతంలో ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు. టీచర్ల కొరత ఉండడంతో పాఠశాలలో విద్యాకమిటీ ఆధ్వర్యంలో వలంటీర్లను నియమించి వారికి స్పోసానే జీతాలను కూడా చెల్లించింది. అంతే కాకుండా 10వేల మొక్కలను నాటి పర్యావరణంపై అవగాహన కల్పించారు.

➤   Minimum Support Price: ఏ మాత్రం స‌రిపోని కనీస మద్దతు ధ‌ర‌

హెచ్‌ఎంగా ఉండటం అదృష్టం

నేను హెడ్‌ మాస్టర్‌గా బాధ్యతలు చేపట్టి కొంతకాలమే అయ్యింది. నా హయాంలో 60 వసంతాల వజ్రోత్సవం జరుగుతుండటం అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి పూర్వ విద్యార్థి తాము చదువుకున్న పాఠశాలకు ఇలాంటి సేవలు అందిస్తే పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా వారు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు.

   – ఈశ్వరమ్మబాయి, హెచ్‌ఎం, ఉన్నత పాఠశాల

➤   Narendra Modi: హెచ్‌సీయూకు ‘5జీ యూజ్‌ కేస్‌ ల్యాబ్‌’ కేటాయింపు

సేవ చేయడం పూర్వజన్మ సుకృతమే

పుట్టినగడ్డను, చదువుకున్న పాఠశాలను, చదువు నేర్పిన గురువులను మరవొద్దు అనేది భావిభారత పౌరులకు నేనిచ్చే సందేశం. ఎపుడో చదువుకున్న పాఠశాలకు ఇలా సేవలు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. కలిసికట్టుగా పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, స్థానికులు పాఠశాల వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని కోరుకుంటున్నా.

   –డాక్టర్‌. యు.ఇలియాజర్‌, జాయింట్‌ సెక్రటరీ, వరల్డ్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లండన్‌
 

#Tags