Skip to main content

Rifle Shooting: రాష్ట్ర స్థాయి రైఫిల్ పోటీల‌కు ఎంపిక‌

ఇటీవ‌లె జిల్లా స్థాయిలో రైఫిల్ షూటింగ్ పోటీలను నిర్వ‌హించ‌గా, అందులో నుంచి త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన వారిని ఎంపిక చేసినట్లు ఫెడ‌రేష‌న్ కార్య‌ద‌ర్శి తెలిపారు. ఈ మెర‌కు ఆయ‌న మాట్లాడుతూ ఇలా అన్నారు..
Federation Secretary appreciating the student Yashwanth Krishna
Federation Secretary appreciating the student Yashwanth Krishna

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లా స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీలలో ఉత్తమ ప్రతిభతో 54 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఎస్‌పీజేఎన్‌ఎం స్కూల్లో శుక్రవారం అండర్‌–14, 17, 19 విభాగాలలో జిల్లా స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీలు శుక్రవారం నిర్వహించారు.

➤   TS TRT Applications : నేడే టీఆర్‌టీ 2023 ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ.. ప‌రీక్ష‌లు మాత్రం..?

ఈ పోటీలలో అండర్‌ –14 విభాగంలో 18 మంది, అండర్‌–17 విభాగంలో 18 మంది, అండర్‌ –19 విభాగంలో 18 మంది మొత్తం 54 మంది ఎంపికైనట్లు ఫెడరేషన్‌ కార్యదర్శి పి.విజయకుమారి తెలిపారు. జిల్లా స్థాయి పోటీలలో ఎంపికైన వారు ఈనెల 28, 29, 30వ తేదీలలో రాజమండ్రి ఇంటర్నేషనల్‌ స్కూల్లో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

➤   Tenth Class Exam Fees: ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ ఫీజు చెల్లింపుకు తేదీ విడుద‌ల‌

రైఫిల్‌ షూటింగ్‌కు ఎంపికైన వారిలో మారుతీనగర్‌, కొర్లగుంట శ్రీవారి హైస్కూల్‌కు చెందిన విద్యార్థి బి.యశ్వంత్‌ కృష్ణ ఉన్నారు. టీమ్‌ మేనేజర్‌ కె.సుధ, స్కూల్‌ ప్రిన్సిపల్‌ బాలక్రిష్ణయ్య, పీఈటీ శివ, యాజమాన్యం,వి ద్యార్థులకు పది రోజులపాటు కోచింగ్‌ ఇచ్చి తీర్చిదిద్దిన వారిని జాతీయ రైఫిల్‌ షూటింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి దేవరాజు అభినందలు తెలియజేశారు.

Published date : 28 Oct 2023 05:51PM

Photo Stories