Skip to main content

12th Graduation Day of Vignan University : విజ్ఞాన్ యూనివ‌ర్సిటీలో 12వ స్నాత‌కోత్సవం.. ఈ విభాగాల్లో మెడ‌ల్స్‌..

ఈ నెల 24న యూనివర్సిటీలో స్నాతకోత్సవాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు వైస్ చాన్స‌ల‌ర్ తెలిపారు..
12th Graduation ceremony of Vignan university on 24th august

చేబ్రోలు: విజ్ఞాన్‌ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 24న నిర్వహించనున్నట్లు వైస్‌ చాన్స్‌లర్‌ పి.నాగభూషణ్‌ తెలిపారు. యూనివర్సిటీలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ, గౌరవ అతిథులుగా హైదరాబాద్‌లోని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ దొంతినేని శేషగిరిరావు, హైదరాబాద్‌లోని లోకేష్‌ మెషీన్స్‌ ఫౌండర్‌ ముల్లపూడి లోకేశ్వరరావు, ఇండియన్‌ కంపోజర్‌ అండ్‌ సింగర్‌ సాలూరి కోటేశ్వరరావు (కోటి) హాజరవుతున్నారని పేర్కొన్నారు.

Teachers Day 2024 : జిల్లాస్థాయి ఉత్త‌మ ఉపాధ్యాయుల పుర‌స్కారానికి ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

12వ స్నాతకోత్సవం సందర్భంగా యూనివర్సిటీ 1,526 మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనుందని వైస్‌ చాన్స్‌లర్‌ తెలిపారు. 26 మంది విద్యార్థులకు బ్రాంచ్‌ల వారీగా అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి బంగారు పతకాలు అందజేస్తామని పేర్కొన్నారు. వీటితో పాటు బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ స్టూడెంట్‌ మెడల్‌, ఎండోమెంట్‌ అవార్డులు, బహుముఖ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి బంగారు పతకం, బెస్ట్‌ ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, సోషల్‌ ఎంగేజ్‌మెంట్‌ అవార్డు, బెస్ట్‌ లీడర్‌ మెడల్స్‌ ఉంటాయని వివరించారు.

Awareness Program in Agriculture : వ్య‌వ‌సాయ రంగంలో విద్యార్థుల‌కు అనుభ‌వ‌పూర్వ‌క అవ‌గాహ‌న క‌ల్పించాలి..

ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు

స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన్‌ యూనివర్సిటీ వివిధ రంగాలలో అందించిన సేవలు, కృషికు గాను ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనుందని వైస్‌ చాన్స్‌లర్‌ తెలిపారు. దొంతినేని శేషగిరి రావు, ముల్లపూడి లోకేశ్వరరావు, కోటిలకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.

Graduation Day

స్నాతకోత్సవంలో విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎం.ఎస్‌. రఘునాథన్‌, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు, అకడమిక్‌ కౌన్సిల్‌, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొంటారని పేర్కొన్నారు.

ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం

AP PGCET 2024 Certificate Verification : ఏపీ పీజీసెట్ 2024 ఆన్‌లైన్ స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ రేప‌టితో ముగింపు..

Published date : 18 Aug 2024 03:03PM

Photo Stories