Teachers Day 2024 : జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారానికి దరఖాస్తులు.. చివరి తేదీ!
గుంటూరు: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న నిర్వహించనున్న జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఈనెల 22లోపు దరఖాస్తుల్ని సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులతో పాటు హెచ్‌ఎంలు అందజేసిన దరఖాస్తుల్ని ఎంఈవోలు పరిశీలించిన తరువాత ఈనెల 24లోపు సంబంధిత ఉప విద్యాశాఖాధికారులకు పంపాలని సూచించారు.
ఉప విద్యాశాఖాధికారులు వాటిని ఈనెల 27లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపాలని తెలిపారు. దరఖాస్తుదారులు కనీసం 15 ఏళ్ల బోధన అనుభవంతో పాటు ఎటువంటి క్రమశిక్షణా చర్యలకు లోనై ఉండరాదని తెలిపారు. ఉప విద్యాశాఖాధికారులు దరఖాస్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే డీఈవో కార్యాలయానికి పంపాలని ఆమె స్పష్టం చేశారు.
Tags
- teachers day
- registrations
- teachers awards
- District Education Officer
- schools and college teachers
- Dr Sarvepalli Radhakrishnan Jayanti
- september 5th
- National Teachers Day 2024
- teachers and lecturers
- Best Teachers Awards
- Education News
- Sakshi Education News
- Guntur education
- Best Teacher Awards
- District Education Officer P. Shailaja
- Government School Teachers
- Teacher Award Applications
- Dr. Sarvepalli Radhakrishnan Celebration
- September 5 Awards
- Teacher Recognition
- District-Level Awards Ceremony
- current affairs about awards