Skip to main content

Awareness Program in Agriculture : వ్య‌వ‌సాయ రంగంలో విద్యార్థుల‌కు అనుభ‌వ‌పూర్వ‌క అవ‌గాహ‌న క‌ల్పించాలి..

Awareness program for school students in agriculture sector

నంద్యాల‌: వ్యవసాయ రంగంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్థానిక ఏపీ మోడల్‌ పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులు పొలం బాట పట్టారు. సేద్యం పనులు, విత్తన ఎంపిక, నాట్లు వేయడం, కలుపు తీత, సస్యరక్షణ చర్యలు తదితర అంశాలపై అగ్రికల్చర్‌ ట్రైనర్‌ జ్యోతి ప్రియ విద్యార్థులకు వివరించారు.

AP PGCET 2024 Certificate Verification : ఏపీ పీజీసెట్ 2024 ఆన్‌లైన్ స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ రేప‌టితో ముగింపు..

ఈ సందర్భంగా ఏపీ మోడల్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ సంగెపు నాగేశ్వరరావు మాట్లాడుతూ పుస్తక పఠనంతో పాటు క్షేత్ర స్థాయి అధ్యయనం జీవితాన్ని నేర్పుతుందన్నారు. ఇలా చేయడం ద్వారా విద్యార్థులకు గొప్ప అనుభూతి కలగడంతో పాటు, తల్లిదండ్రుల కష్టం విలువ తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ సురేష్‌కుమార్‌, ఎస్‌ఓ లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

– రుద్రవరం

NMMS Exam in Odiya : ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష ఇక‌పై ఒడియాలో కూడా..!

Published date : 18 Aug 2024 02:23PM

Photo Stories