Exam : ఈ పరీక్షను తప్పనిసరిగా నిర్వహించాల్సిందే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే మోడల్ పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా డీఈఓ విజయేంద్రరావు ఆదేశించారు. శుక్రవారం జెడ్పీ సమావేశమందిరంలో స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే పరీక్ష నిర్వహణపై ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు ఓరియెంటేషన్ కార్యక్రమం చేపట్టారు.
డీఈఓ మాట్లాడుతూ నవంబర్ 3వ తేదీన అచీవ్‌మెంట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా చేసుకోవాలని చెప్పారు.
749 పాఠశాలల్లో కచ్చితంగా..
గుర్తించిన 749 పాఠశాలల్లో కచ్చితంగా పరీక్ష జరిపించాలని సూచించారు. లేకుంటే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉమ్మడి పరీక్షల విభాగం సెక్రటరీ హేమారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులోని నైపుణ్యాల పరిశీలనకు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి జయప్రకాష్, డైట్ కళాశాల అధ్యాపకుడు ప్రభాకర్‌రాజు పాల్గొన్నారు.
Published date : 28 Oct 2023 07:01PM